సమంత అంటే ఇష్టమంటూ బాంబు పేల్చిన హీరో
తెలుగు ప్రేక్షకులకు సమంత క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సమంత సినిమాల్లో నటించి ఏడాదిన్నరకు పైగానే అయింది. సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' సినిమాలో కనిపించింది. ఈ సినిమా తర్వాత ఆమె మరో సినిమాలో కనిపించలేదు. అయినప్పటికీ ఆమె గురించి ఇండస్ట్రీలో విపరీతమైన చర్చ సాగుతోంది. బాలీవుడ్ నటి అలియా భట్ నటించిన 'జిగ్రా' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సమంత చాలాకాలం తర్వాత హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో ఆమె అభిమానులు చేసిన రచ్చ అంత ఇంత కాదు. ఈ ఘటనతో సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదని నిరూపణ అయింది.
ఆరోగ్య సమస్యలతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత..తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. సమంత ప్రస్తుతం ''సిటాడెల్'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో వరుణ్ ధావన్ సమంతపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమంత వంటి టాలెంటెడ్ యాక్టర్‌తో నటించడం చాలా హ్యాపీగా ఉందని వరుణ్ ధావన్ చెప్పుకొచ్చారు. హీరోలకు ధీటుగా ఆమె చేసిన ఫైట్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయని అతను తెలిపాడు.

సమంత నటించిన 'ఈగ' సినిమాలో ఆమె నటనకు నేను ఫ్లాట్ అయిపోయానని వరుణ్ ధావన్ పేర్కొన్నాడు. అప్పటి నుంచి సమంత అంటే నాకు చాలా ఇష్టమని ఈ బాలీవుడ్ హీరో చెప్పుకొచ్చాడు. సామ్‌తో సినిమా అవకాశం వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వరుణ్ ధావన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరు కలిసి నటించిన ''సిటాడెల్'' వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది.
ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతోంది. వరుణ్ ధావన్‌తో పాటు సమంత కూడా యాక్షన్ సీక్వెన్స్ చేసినట్టు స్పష్టం అవుతోంది. ఇదే విధంగా ఈ వెబ్ సిరీస్‌లో సమంత బొల్డ్‌గా కనిపించారనే టాక్ వినిపిస్తోంది. టీజర్‌లో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నట్టు చూపించారు. దీంతో వెబ్ సిరీస్‌లో రొమాంటిక్ సీన్స్‌కు కొదవలేదని అర్ధం అవుతోంది. వరుణ్ ధావన్-సమంతల మధ్య బొల్డ్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఆ సీన్లలో వీరిద్దరు రెచ్చిపోయి నటించారనే టాక్ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ట్రైలర్‌తో సమంత సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.












Click it and Unblock the Notifications