ఆల్‌టైం చెత్త రికార్డును నెలకొల్పిన వరుణ్‌తేజ్ 'మట్కా'!

మరో మెగా హీరో నుంచి వచ్చిన సినిమా నిర్మాతను, బయ్యర్లను నిండా ముంచేసింది. ప్రేక్షకులకు కొత్తదనం కోసం ప్రయత్నించే వరుణ్ తేజ్ స్క్రిప్ట్ ఎంపికలో చేస్తున్న పొరపాట్లు అతని మార్కెట్ ను తగ్గించేస్తున్నాయి. వరుసపెట్టి ఫ్లాప్ సినిమాలు చేస్తుండటంతో ఆ ప్రభావం మట్కాపై పడింది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను చిత్రీకరించినట్లు మొదటినుంచి ప్రచారం జరగడంతో థియేట్రికల్ బిజినెస్ రూ.20కోట్లకు మించే జరిగింది. అయితే సినిమా మొదటిరోజు మొదటి ఆట నుంచే ఘోరమైన డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో తర్వాత ప్రేక్షకులెవరూ థియేటర్లకు రాలేదు.

రూ.18 కోట్ల నష్టం
ఆ ప్రభావం మట్కాపై దారుణంగా పడి అతి చెత్త రికార్డును నెలకొల్పింది. రూ.18 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ప్రమోషన్స్ కోసమే ఈ సినిమాకు రూ.2 కోట్లు ఖర్చుపెట్టారు. నిర్మాత కూడా బాగా నమ్మకంతో ఉన్నప్పటికీ అతనికీ నిరాశ తప్పలేదు. నైజాంలో రూ.47 లక్షల షేర్ రాగా, ఏపీలో రూ.67 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.15 లక్షల షేర్ మాత్రమే ఈ సినిమా రాబట్టింది. చిన్న చిన్న సినిమాలు, అతి తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతున్న తరుణంలో వరుణ్ తేజ్ సినిమాలు మాత్రం ఎందుకు ఇలా అవుతున్నాయో ఆలోచించుకోవాల్సి ఉంది. అంతేకాదు.. అతనికి దగ్గరుండి చిరంజీవి గైడెన్స్ ఇవ్వాల్సి ఉందని మెగా అభిమానులు అంటున్నారు.

Varun Tej Matka movie sets worst record with zero shares on 5th day

5వ రోజు సున్నా షేర్
మట్కా సినిమా విడుదలైన 5వ రోజు సున్నా షేర్ దక్కించుకొని అతి చెత్త రికార్డును నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 5 రోజులకు కలిపి రూ.1.30 కోట్లు మాత్రమే వచ్చాయి. పాత్ర కోసం, ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచేందుకు ఎంతైనా కష్టపడే వరుణ్ తేజ్ సినిమా ఇటువంటి రికార్డును నెలకొల్పడం దురదృష్టకరమని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఒకరకంగా ఈ రికార్డుతో, ఈ కలెక్షన్లతో మెగా హీరోల పరువు పోయిందని అభిమానులు బాధపడుతున్నారు. తన కెరీర్ లో గద్దలకొండ గణేష్, ఎఫ్2, ఎఫ్3, ఫిదా, తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ సినిమాలున్నాయి. ప్రస్తుతం ఏ తరహా చిత్రం చేయాలి అనే విషయంలో పెదనాన్న చిరంజీవి సలహా తీసుకోవడంతోపాటు చిరు దగ్గరుండి పర్యవేక్షిస్తేనే వరుణ్ మార్కెట్ నిలబడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా చేయకపోతే కష్టమంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+