వెంకటేష్ - రామ్ చరణ్ కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్‌ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన వెంకీ కంటెంట్ పరంగా హిట్ అవుతుంది అనుకున్న సినిమాలను మాత్రమే చేశారు. ఒకటీ అరా మినహా దాదాపుగా వెంకీ చేసిన సినిమాలన్నీ హిట్ సినిమాలే. తండ్రి దగ్గుబాటి రామానాయుడు తనయుడుగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన సొంత టాలెంట్ తో ఎదిగిన వెంకటేష్ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తన మూడున్నర దశాబ్దాల సినీ కెరీర్‌లో వెంకటేష్ ఎన్నో హిట్ సినిమాలను కూడా తిరస్కరించారు.

ఈ జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సూపర్ హిట్ మూవీ కూడా ఉంది. అదే గోవిందుడు అందరివాడేలే సినిమా. వాస్తవానికి ఈ సినిమా వెంకటేష్, రామ్ చరణ్ కాంబినేషన్లో రావాల్సి ఉన్నప్పటికీ అలా జరగలేదు. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ నటించారు. సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్, కమలినీ ముఖర్జీ, జయసుధ తదితరులు నటించారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా స్వరాలందించారు.

venkatesh and ramcharan latest news

2014 అక్టోబర్ 1న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర తర్వాత హైలెట్ అయిన క్యారెక్టర్ శ్రీకాంత్. బాబాయ్ , అబ్బాయిల్లా వీరు నటించారు. శ్రీకాంత్ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ కృష్ణవంశీ మొదట వెంకటేష్ అనుకున్నారంట. ఆ క్యారెక్టర్ తనకు పెద్దగా సూట్ కాదంటూ వెంకీ సున్నితంగా తిరస్కరించాడు. దీంతో వెంకటేష్‌కు బదులు శ్రీకాంత్ నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+