వెంకీ, రానా, నాగచైతన్య మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేష్ అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. ఆయన వారసులుగా రానా అడుగుపెట్టి విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. అలాగే వెంకీ మేనల్లుడు నాగచైతన్య కూడా మీడియం రేంజ్ హీరోగా ఉన్నారు. స్టార్ హీరోగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో వెంకీ-నాగచైతన్య కాంబోలో సినిమా వచ్చింది కానీ ముగ్గురి కాంబినేషనల్ లో మాత్రం సినిమా రాలేదు. అందుకు తగ్గ కథ వస్తే చేయడానికి సిద్ధమని ముగ్గురూ ప్రకటించారు.
తాజాగా దీనికి సంబంధించిన కథ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దర్శకుడు తేజ ఈ ముగ్గురికి కలిసి కథ వినిపించారని, ముగ్గురూ ఓకే చెప్పారని తెలుస్తోంది. ప్రస్తుతం రానా తేజ దర్శకత్వంలో రాక్షస రాజు చిత్రం చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కనపడుతోంది. నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ చేస్తున్నారు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేయబోతున్నారు. ఇవి పూర్తయిన తర్వాత ఈ భారీ మల్టీస్టారర్ ప్రారంభం కానుంది.

గతంలో వెంకీ-రానా కాంబోలో రానానాయుడు వెబ్ సిరీస్ వచ్చింది. అయితే ఇందులో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో వెంకటేష్ ఇమేజ్ మసకబారింది. అన్నీ కుటుంబ కథా చిత్రాలు, క్లీన్ చిత్రాలు చేసే వెంకీ కెరీర్ పై ఇది మాయని మచ్చలా పడింది. వీరి కుటుంబంలోనే మూడో తరం హీరోగా ఉన్న నాగచైతన్యతో గతంలో వెంకీమామ సినిమా చేశారు వెంకటేష్. ఇప్పుడు ముగ్గురూ కలిసి భారీ మల్టీస్టారర్ చేయనుండటంతో అభిమానులు సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దర్శకుడు ఎంతవరకు సమర్థవంతంగా చిత్రీకరించగలడో చూడాలి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చక్కటి కుటుంబ కథా చిత్రాలు, మంచి ప్రేమకథా చిత్రాల కథానాయకుడిగా పేరు సంపాదించుకున్నారు విక్టరీ వెంకటేష్.సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ, ఒక అగ్ర నిర్మాత తనయుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ తన కష్టాన్ని, టాలెంట్ ను మాత్రమే నమ్ముకొని అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా మారారు. మహిళా అభిమానులను ఎక్కువగా సంపాదించుకున్నారు. వెంకీ నుంచి చిత్రం వస్తోంది అంటే.. కచ్చితంగా అది మినిమం గ్యారంటీగా భావిస్తారు. అందాల నటుడు శోభన్ బాబు తర్వాత అంతటిపేరును కొల్లగొట్టారు వెంకటేష్.
యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్న వెంకీ ఆస్తుల విలువ ఎంత ఉంటుందని అభిమానులు సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు. హైదరాబాద్ లో ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంది. తాను చేసిన సినిమాల నుంచి సంపాదించిన డబ్బు కలుపుకుంటే రూ.2500 కోట్లకు పైగా ఆస్తి ఉంది. కేవలం ఇవి తాను సంపాదించిన సంపాదన మాత్రమే. అగ్ర నిర్మాతగా పరిశ్రమను శాసించిన రామానాయుడి నుంచి వారసత్వంగా మరికొన్ని ఆస్తులు వెంకటేష్ కు సంక్రమించాయి. దీంతో వాటిని కూడా కలుపుకుంటే వెంకీ ఆస్తి చాలా ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమతోపాటు ఏపీ, తెలంగాణలో అత్యధిక ధనవంతుల జాబితాలో వెంకటేష్ ఒకరుగా ఉన్నారు. వ్యాపారాలు కూడా భారీగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే అవి వెంకీవని చాలామందికి తెలియదంటారు. వాటిని తన సోదరుడితోపాటు ఇతర సన్నిహితులు చూస్తుంటారు. ఇటీవలే దృశ్యం, నారప్ప చిత్రాలను అమ్మడంద్వారా వెంకీ సోదరుడు సురేష్ బాబు రూ.70 కోట్లు ఆర్జించారు. కేవలం సినిమాల అమ్మకంద్వారానే ఇలావుంటే రియల్ ఎస్టేట్.. తదితర వ్యాపారాలద్వారా వెంకటేష్ తోపాటు సురేష్ బాబు ఆస్తులు కూడా భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications