వెంకటేశ్- త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి క్రేజీ అప్డేట్ రిలీజ్..
విక్టరీ వెంకటేశ్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి రెండో సాంగ్ ను దసరా పండగ కానుకగా విడుదల చేసింది చిత్ర యూనిట్. 'మాలా వచ్చా చూడు..' అనే సాంగ్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. 'నీ ఒంట్లో ఉంది కరెంటు.. వెలిగించవే నా ఫిలమెంట్' అంటూ సాగే ఈ హుషారైన పాటలో విక్టరీ వెంకటేశ్, నివేథా పేతురాజ్ మధ్య సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక తమన్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. అలాగే ఈ పాటను ధనుంజయ సీపాన, రనైనా రెడ్డి, తమన్ కలిసి పాడారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన నారాయణమ్మ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఇక ఆదర్శ కుటుంబం మూవీ ఇప్పటికే దసరా పండగ కానుకగా విడుదల కావాల్సి ఉంది. ముందుగా అక్టోబర్ 2 న రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. కానీ ఆ తర్వాత వారం రోజుల పాటు వాయిదా వేస్తూ అక్టోబర్ 9 న రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ ఆ డేట్ ను కూడా వాయిదా వేశారు. ఇప్పుడు దసరా బరి నుంచి ఈ మూవీ తప్పుకుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 30 న విడుదల చేయాలని చిత్ర యూనిట్ తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 21 లేదా 22న ఆదర్శ కుటుంబం మూవీకి సంబంధించి భారీ ఈవెంట్ ఉంటుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పష్టం చేశారు. దాంతో ఈ మూవీ రిలీజ్ పై సందిగ్ధత తొలగింది.

ఇక ఆదర్శకుటుంబం మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. ఆదర్శ కుటుంబం మూవీలో విక్టరీ వెంకటేశ్ సరసన హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించింది. అలాగే ఈ చిత్రంలో నారా రోహిత్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న 'జనవరి 12 విడుదల' మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications
