మళ్లీ కలిసిన డెడ్లీ కాంబో.. ఈసారి నెక్స్ట్ లెవెల్ అంటున్న "వెంకీ - త్రివిక్రమ్" !
టాలీవుడ్ సీనియర్ హీరో "విక్టరీ వెంకటేష్" ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా భారీ విజయాన్ని సాధించింది. రీజనల్ ఫిల్మ్‌గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాల్లో తన సొంత మార్క్‌ను మరోసారి రుజువు చేసుకున్నారు వెంకీ మామ.
గత కొన్ని రోజులుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో వెంకటేష్ సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో "నువ్వు నాకు నచ్చావ్", "మల్లీశ్వరి" వంటి చిత్రాలకు త్రివిక్రమ్ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. ఆ రెండు సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అందుకే ఈ జోడీ మళ్లీ కలిస్తే ఏ రేంజ్‌లో మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

మళ్లీ కలిసిన డెడ్లీ కాంబో..
ఇప్పుడీ వార్తలను నిజం చేస్తూ వీరి కాంబినేషన్ లో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. ఈ మూవీని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. చిత్ర యూనిట్ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే త్రివిక్రమ్ అసలు అల్లు అర్జున్‌తో సినిమా చేయాల్సి ఉండగా, స్క్రిప్ట్ పూర్తి కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. దీంతో బన్నీ ముందుగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ - వెంకటేష్ చిత్రం ఫినిష్ చేస్తారని అంటున్నారు. ఈ సినిమా కథ పూర్తిగా విశాఖపట్నం నేపథ్యంలో సాగబోతుందని ఇండస్ట్రీ టాక్. త్రివిక్రమ్ తనదైన హ్యూమర్, పంచ్ డైలాగ్స్‌తో రాయబోతున్న కథలో వెంకీ మామ గతంలో కనిపించని కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
టైటిల్ టాక్..
సినిమాకు "వెంకటరమణ" అనే టైటిల్ పరిశీలనలో ఉందని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ టైటిల్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకర్షించడంతో పాటు వెంకీ ఇమేజ్‌కి సరిపోతుందని భావిస్తున్నారు. తనదైన డైలాగ్స్ తో త్రివిక్రమ్ రెచ్చిపోతే.. వెంకీ మామ యాక్టింగ్ తో కుమ్మేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా.. రెగ్యులర్ షూట్ ప్రారంభ తేదీ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.
#VenkateshXTrivikram
— Venkatesh Daggubati (@VenkyMama) August 15, 2025
This one is special ❤️#Trivikram #SRadhaKrishna (Chinababu) garu @vamsi84 @haarikahassine #Venky77 pic.twitter.com/CDWYUypmes












Click it and Unblock the Notifications