ప్రతి సంక్రాంతికీ హిట్టు కొట్టడం కామనేగా..? ఎలా అన్నా..

టాలీవుడ్‌ లో బ్లాక్‌ బస్టర్లకు కేరాఫ్ అడ్రస్‌ ఎవరంటే డైరెక్టర్ అనిల్ రావిపూడి పేరునే అందరూ చెబుతారు. ఇప్పటికి ఆయన చేసిన 9 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరోగా సంక్రాంతి కానుకగా వచ్చిన 'మన శంకర్ వర ప్రసాద్ గారు' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విక్టరీ వెంకటేశ్- కల్యాణ్ రామ్ కాంబోలో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఈ చిత్రానికి జనవరి 12 విడుదల అనే ఆసక్తికరమైన టైటిల్‌ ను ఖరారు చేశారు. బావ బామ్మ‌ర్ది సౌజ‌న్యంతో అనేది ఉప శీర్షిక‌గా పెట్టారు. ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. అయితే తాజాగా ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ ఓ హింట్ ఇచ్చారు. ఇప్పటికే గంటన్నరకు పైగా పూర్తయిన సినిమా రఫ్ ఫూటేజీని తాను చూశానని తెలిపారు. వచ్చే సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సినిమా లోడింగ్ అని తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేశారు. అంతేకాక వెంకటేశ్- కల్యాణ్ రామ్ మాట్లాడుకుంటున్నట్లు ఉన్న సినిమాలోని ఓ క్లిప్ ను ట్వీట్ కు యాడ్ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు అప్పుడే గంటన్నర సినిమా తీశారా అని షాక్ అవుతున్నారు.

Venkatesh Anil Ravipudi movie Photo from the shoot leaked Another Sankranti blockbuster guaranteed

మరికొంతమంది అనిల్ రావిపూడి జెడ్ స్పీడ్ టేకింగ్ కు ఫిదా అవుతున్నారు.. వస్తాడు.. హిట్ కొట్టి పోతాడు.. కామనేగా అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక జనవరి 12 విడుదల మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గరపాటి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఎంటి అర్చన సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. వీలైనంత త్వరగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమాను సంక్రాంతి 2027 కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+