సంక్రాంతి విన్నర్ బాలయ్య కాదు.. ఆ హీరోనే..!
సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడి పందాలు ఎంత ఫేమసో, తెలుగు సినిమాలు రిలీజ్ కావడం అంతే ఫేమస్. ఇంకా చెప్పాలంటే సంక్రాంతి సినిమా ఇండస్ట్రీకి అతి పెద్ద పండుగ.పెద్ద హీరోల సినిమాలు సాధ్యమైనంత వరకు సంక్రాంతి రేసులో ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. ఫ్యామిలీ అంతా కలిసి కేవలం సంక్రాంతి పండక్కి మాత్రమే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తుంటారు. ఈ కారణంగానే పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతికి విడుదల అయ్యేలా చూస్తుంటారు. తద్వారా సినిమాలకు భారీ కలెక్షన్లు సాధిస్తాయి.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంక్రాంతికి సైతం మూడు భారీ సినిమాలు విడుదలయ్యాయి. నందమూరి బాలకృష్ణ, యాక్షన్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం "డాకు మహారాజ్",గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తమిళ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం "గేమ్ ఛేంజర్",విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన "సంక్రాంతికి వస్తున్నాం" ఈ మూడు సినిమాలు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిల్లో "డాకు మహారాజ్","సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలు హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి.భారీ అంచనాల మధ్య విడుదలైన "గేమ్ ఛేంజర్" మాత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుని ఫ్లాప్‌గా నిలిచింది.

ఒకసారి ఈ సినిమాలను కలెక్షన్లను పరిశీలిస్తే..గేమ్ చేంజర్ గురించి చెప్పుకుంటే, ఈ చిత్రం రెండో రోజుకే రూ. 100 కోట్ల మార్క్‌ను అందుకుంది. ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా, అభిమానులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. బాలకృష్ణ 'డాకు మహారాజ్' నాలుగో రోజున 100 కోట్ల మార్క్‌ను అందుకుంది. బాలకృష్ణ మాస్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో మరోసారి ఈ సినిమా రుజువు చేసింది.బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. 12వ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1.13 కోట్లు వసూలు రాబట్టింది. దీనితో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ మొత్తం రూ. 83.53 కోట్లకు చేరింది. వెంకటేశ్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా మూడవ రోజునే 100 కోట్ల క్లబ్‌లో చేరింది.
వెంకటేశ్ కెరీర్‌లోనే ఇదొక గొప్ప ఫీట్‌గా చెప్పుకోవచ్చు. 2025లోనే "సంక్రాంతికి వస్తున్నాం" క్లీన్ హిట్‌గా నిలిచింది. ఇది వెంకటేశ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్ల చిత్రంగా "సంక్రాంతికి వస్తున్నాం" నిలిచింది. అలాగే బుకింగ్స్‌లో ఈ సినిమా మిగతా రెండు సినిమాల కంటే టాప్ ట్రెండింగ్‌లో ఉండడం విశేషం. ఓవర్సీస్‌లో కూడా "సంక్రాంతికి వస్తున్నాం" ఒక రికార్డ్ ను చేరుకుంది. నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న వెంకటేశ్ చిత్రంగా "సంక్రాంతికి వస్తున్నాం" రికార్డు సృష్టించింది.
మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 106 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువ స్థాయిలో బుకింగ్స్ నమోడవ్వడం విశేషం. మూడో రోజుల్లో టోటల్‌గా 29 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి, వెంకటేశ్ సినిమాల్లోనే వేగవంతమైన 100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా నిలిచింది. అలాగే ఈ సినిమా ఏడు రోజుల్లోనే రూ.203 కోట్లు సాధించింది.సోలో హీరోగా వెంకటేశ్ రూ.100 కోట్లు వసూలు చేసిన సినిమాగా ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' రికార్డు సృష్టించింది. తెలుగు సీనియర్ హీరోల్లో రూ.200 కోట్లు వసూలు చేసిన నటుల్లో చిరంజీవి (సైరా, వాల్తేర్ వీరయ్య) తర్వాత ఈ రికార్డును అందుకున్న నటుడిగా వెంకటేశ్ రికార్డు సృష్టించారు. మొత్తానికి బాలయ్య, రామ్ చరణ్ వంటి మాస్ హీరోలను వెనక్కి నెట్టి వెంకటేష్ సంక్రాంతి విన్నర్‌గా నిలిచారు.












Click it and Unblock the Notifications