పండగ రేసు నుంచి తప్పుకున్న వెంకటేశ్ సినిమా.. ఫ్యాన్స్ కు పెద్ద షాక్..

పండక్కి పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఓ వైపు పండగ వాతావరణం మరోవైపు స్టార్ హీరో సినిమా థియేటర్లలో రిలీజ్ కావడం అంటే అంతకన్నా ఏం కావాలి అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు. అందుకే పెద్ద పెద్ద సినిమాలు అన్నీ పండగే టార్గెట్ గా వస్తుంటాయి. లేదా వేసవిలో రిలీజ్ అవుతుంటాయి. అయితే ఇటీవలి కాలంలో ప్రతి సంక్రాంతి పండక్కి విక్టరీ వెంకటేశ్ సినిమా రిలీజ్ కావడం అది హిట్ కావడం జరుగుతూ ఉంది. గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఈ ఏడాది సంక్రాంతి పండక్కి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు మూవీలో వెంకటేశ్ క్యామిలో రోల్ లో కనిపించి సందడి చేశారు. అంతకుముందు 2019లో సంక్రాంతి సమయంలో ఎఫ్ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో జనవరి 12 విడుదల అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు వెంకటేశ్. ఇందుకు సంబంధించిన రిలీజ్ డేట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

Venkatesh new movie Adarsha Kutumbam directed by Trivikram Release date was postponed officially

అయితే అంతకంటే ముందు ఈ ఏడాది దసరా కానుకగా వెంకటేశ్ ఆదర్శ కుటుంబం సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 9 విడుదల చేసేందుకు సిద్దం అయినా అనూహ్యంగా రిలీజ్ డేట్ వాయిదా పడింది. దాంతో వెంకటేశ్ అభిమానులకు నిరాశ ఎదురైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ చేస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇదివరకు వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలు బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురు చూశారు. కానీ సడెన్ గా మూవీ వాయిదా పడడంతో వారికి షాక్ తగిలింది. ఇక ఈ మూవీ అక్టోబర్ 30 న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+