వియ్యంకులు కాబోతున్న వెంకటేష్, విజయవాడ డాక్టర్
విక్టరీ వెంకటేష్ అంటే కేవలం తన అభిమానులకే కాకుండా సాధారణ సినిమా ప్రేక్షకులకి కూడా ఎంతో అభిమానం ఉంటుంది. 36 సంవత్సరాల నుంచి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తన నటనద్వారా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో వెంకీ గా కొలువు తీరారు. ఇటువంటి తరుణంలో ఆయన కుటుంబం నుంచి బయటకు వచ్చిన ఒక వార్త అందరినీ ఆనందంలో ముంచెత్తింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అందరు కథానాయకుల కుటుంబాల గురించి అన్ని వివరాలు అభిమానులు తెలుసుకుంటారు. అయితే వెంకటేష్ కుటుంబ విషయాలు మాత్రం ఎప్పుడూ బయటకు రావు. చాలామందికి అసలు వెంకటేష్ కు ఎంత మంది పిల్లలున్నారనే విషయం కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. అంతగా లోప్రొఫైల్ ను వెంకీ నిర్వహించారు. ప్రస్తుతం ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీ వల్ల అందరికీ సంబంధించిన అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి.

వెంకటేష్ పెద్ద కూతురు అశ్రీత వివాహం సంవత్సరం క్రితం ఆమె ప్రేమించిన వ్యక్తితో అతిరథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా వెంకీ రెండో కూతురు హయ వాహిని కూడా పెళ్లి పీటలు ఎక్కబోతోంది. హయవాహిని వివాహం విజయవాడ కి చెందిన ఒక డాక్టర్ కొడుకుతో జరగబోతోంది. ఈరోజు వారి నిశ్చితార్థం విజయవాడలో ఘనంగా జరగనుంది. దగ్గుబాటి కుటుంబంలో పెళ్లి సందడి ప్రారంభమైంది. వెంకీ తాజాగా సైంధవ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఆ చిత్ర ట్రైలర్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది.












Click it and Unblock the Notifications