Chaari 111: వెన్నెల కిషోర్ హీరోగా స్సై థ్రిల్లర్: భారీ బడ్జెట్ మూవీ
హైదరాబాద్: టాలీవుడ్‌లో బిజీయెస్ట్ కమేడియన్ వెన్నెల కిషోర్ (Vennela Kishore). బ్రహ్మానందం తరువాత ఆ స్థాయిలో స్టార్ కమేడియన్ హోదా తెచ్చుకున్న ఏకైక నటుడు. ఈ ఏడాదే ఇప్పటివరకు వెన్నెల కిశోర్ నటించిన 14 సినిమాలు విడుదలయ్యాయి. డిసెంబర్ నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
వెన్నెల కిషోర్ హీరోగా ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది. గప్‌చుప్‌గా షూటింగ్ జరుపుకుంటోందీ మూవీ. పేరు చారి 111 (Chaari 111). ఇదో స్పై- థ్రిల్లర్. టీజీ కీర్తి కుమార్ దర్శకుడు. ఆయనే ఈ సినిమాకు కథను కూడా సమకూర్చారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ సీజన్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

వెన్నెల కిషోర్ సరసన సంయుక్త విశ్వనాథన్ (Samyuktha Viswanathan) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదివరకు ఆమె ఓహ్ మనపెన్నెలో నటించారు. జాక్సన్ దురై- ది సెకెండ్ చాఫ్టర్ సెట్స్‌పై ఉంది, మోడర్న్ లవ్ చెన్నై, ఐ హేట్ యు- ఐ లవ్ యూ వెబ్ సిరీస్‌ల్లో లీడ్ క్యారెక్టర్‌లో కనిపించారు.
చారి 111 సినిమా ఫస్ట్ లుక్‌ను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది యూనిట్. గూఢచారి గెటప్‌లో అదరగొట్టాడు వెన్నెల కిషోర్. గన్ ఎక్కుపెట్టిన స్టిల్‌లో బాండ్ లుక్స్‌తో కనిపించాడు. బాండ్ సినిమాల్లో హీరో కామన్‌గా ధరించే బ్లాక్ బ్లేజర్‌తో స్టైలిష్ లుక్‌తో డిఫరెంట్‌గా కనిపించారాయన. ఛార్మినార్ బ్యాక్‌గ్రౌండ్‌గా బ్లాస్టింగులు, ఛేజింగులతో విడుదలైన ఈ ఫస్ట్‌లుక్.. సినిమాపై అంచనాలను పెంచింది.












Click it and Unblock the Notifications