'సలార్' సినిమాపై వేణుస్వామి ఏమి చెప్పారు?
ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాను పూర్తిచేసి ప్రాజెక్ట్ కే చేస్తున్నాడు. సెప్టెంబరు 28వ తేదీనే సలార్ విడుదల కావాల్సి ఉన్నప్పటికీ రష్ చూసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ కొన్ని సీన్స్ ను మార్చాలని నిర్ణయించుకున్నాడు. దీంతో కొన్ని సన్నివేశాలన మళ్లీ చిత్రీకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అదేమీ లేదని గ్రాఫిక్ వర్క్ వల్ల ఆలస్యమవుతోందని ప్రభాస్ అభిమానులు అంటున్నారు.
బాలీవుడ్ లో పర్వాలేదు
బాహుబలి 1, 2 సినిమాల తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చేయగా ఈ మూడు డిజాస్టర్లుగా మిగిలాయి. సాహో మాత్రం బాలీవుడ్ లో పర్వాలేదనిపించుకుంది. హిందీ వరకు రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా సలార్ పై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబరు 22వ తేదీన విడుదల కాబోతోంది. కచ్చితంగా తమ హీరో బ్లాక్ బస్టర్ కొడతాడనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

ఎవరూ పట్టించుకోలేదుకానీ..
సినీ, రాజకీయ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ తాను కూడా ఒక సెలబ్రిటీలా మారిన వేణుస్వామి మాత్రం బాహుబలి1, బాహుబలి2 చిత్రాల తర్వాత ప్రభాస్ జాతకాన్ని చెబుతూ వచ్చారు. ఆయన ప్రతి సినిమాకు ముందు వేణుస్వామి రంగంలోకి దిగడం.. ఆ సినిమా బాలేదని చెప్పడం.. ప్రభాస్ జాతకం అస్సలు బాలేదని, ఆయనతో సినిమాలు తీసే నిర్మాతలు కూడా తమ జాతకాలు చూపించుకోవాలంటూ వ్యాఖ్యలు చేసేవాడు. వేరే పరిస్థితుల్లో అయితే దీన్ని గురించి పట్టించుకునేవారు కాదుకానీ సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పిన తర్వాత ఆయన చెప్పేవాటికి ప్రాముఖ్యత ఏర్పడింది.
హమ్మయ్య అనుకుంటున్న అభిమానులు
ఆదిపురుష్ విడుదలకు రెండు వారాల ముందే ప్రభాస్ జాతకం కారణంగా ఈ సినిమా ఎటువంటి సంచనాలు నమోదు చేయదని, హిట్ అయ్యే అవకాశమే లేదని తేల్చిచెప్పారు వేణుస్వామి. ఆయన చెప్పినట్లే సినిమా దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రభాస్ కన్నా దర్శకుడు ఓం రౌత్ ను అందరూ తిట్టిపోశారు. రామాయాణాన్ని ఇష్టం వచ్చినట్లు తీశాడంటూ మండిపడ్డారు. సలార్ చిత్రం గురించి కూడా వేణుస్వామి ఏదైనా విషయం చెప్పాడా? దాని జాతకం కూడా చెప్పాడా? అంటూ నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. అయితే సలార్ కు సంబంధించి వేణుస్వామి చెప్పినట్లుగా ఏ వీడియోలు దొరక్కపోవడంతో డార్లింగ్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా సలార్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలున్నాయి. సినిమా కొంచెం నచ్చినా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications