మళ్లీ బాంబ్ పేల్చిన వేణు స్వామి.. ప్రభాస్, సమంత, విజయ్ చనిపోతారని కామెంట్స్!

ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులే. నా రూటే సపరేటు అనేలా ఎప్పుడూ ఏదో ఒక బాంబ్ పేలుస్తూనే ఉంటారు ఈయన. సమంత- నాగ చైతన్య విడిపోతారని వారి ఎంగేజ్ మెంట్ అయిన తరువాత చెప్పడం.. అ విధంగానే వారు విడిపోవడంతో ఆయన బాగా ఫేమస్ అయ్యారు. అప్పటి నుంచి సెలబ్రిటీల జాతకాలను, రాజకీయాల గురించి సైతం కామెంట్స్ చేశారు.

గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని.. జగన్ కి మహర్దశ పడుతుందని అన్నారు. కానీ అది రివర్స్ అయ్యింది. అలానే ప్రభాస్ కి ఇప్పట్లో హిట్ రాదని చెప్పి అబాసుపాలయ్యారు. గత ఎన్నికల విషయంలో సైతం కూటమి ఓడిపోతుందని చెప్పడంతో.. గెలిచిన తర్వాత కూటమి కార్యకర్తలు ఆయనను గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా నాగ చైతన్య, శోభిత పెళ్లి చేసుకుంటే విడిపోతారు అంటూ వ్యాఖ్యానించారు. అయితే రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియా వేదికగా ఆయనపై గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి.

venu-swamy-comments-that-prabhas-samantha-vijay-will-die

అయితే ఇప్పుడు ఏకంగా వేణు స్వామికి సంబంధించిన ఒక సంచలన ఆడియో లీకై అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా ముగ్గురు స్టార్స్ చనిపోతారని చెప్పి హాట్ బాంబు పేల్చారు. ఒక హీరోయిన్, ఒక హీరో ఆత్మహత్య చేసుకునే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.

సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్ లలో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకుంటారని, తన లెక్క ప్రకారం విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకుంటారని, ఈ విషయాలు మునుమందు తెలుస్తాయని, ఇంకా మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు అంటూ కూడా ఆయన తెలిపారు. దీనికి తోడు ప్రభాస్ గురించి కూడా మాట్లాడుతూ.. ప్రభాస్ కు శరీరమంతా గాయాలే ఉన్నాయి .కానీ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పడం లేదు.ఇటు 'రాజాసాబ్' చిత్రం కూడా అందుకే పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నారని, ఇవన్నీ ముందు జరగబోతున్నాయి.

అన్ని అయిన తర్వాతే మాట్లాడుకుందాం అంటూ ఆయన చెప్పిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీంతో ప్రస్తుతం వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు విన్న స్టార్ హీరోలు, హీరోయిన్ అభిమానులు వేణుస్వామిపై ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై వారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+