పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లి ఖాయం
సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. సమంత, నాగచైతన్యలు వివాహిక జీవితం అంత సాఫీగా సాగదని ముందే చెప్పి సంచలనం సృష్టించారాయన. వేణు స్వామి చెప్పిన విధంగానే సమంత, నాగచైతన్య విడిపోయారు. ఆ తరువాత మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించకున్నారాయన.
దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్‌లో క్రేజ్ పెరిగింది. డింపుల్ హయాతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయ నాయకుల జాతకాలు గురించి ఆయన చెప్పినవి చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. దీంతో ఆయన జ్యోతిష్యానికి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. తాజాగా ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

పవన్ కల్యాణ్‌ది ఉత్తరాషాడ నక్షత్రం 2017 నుంచి 2025 వరకు శని ఉంది. జూలై వరకు దాని ప్రభావం ఉంటుందని వేణు స్వామి తెలిపారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన 2024 చివరి వరకు మరో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని చెప్పి గట్టి షాకిచ్చారు. పెళ్లిళ్లు అనేవి పవన్ వ్యక్తిగతం అయినప్పటికీ నాలుగో పెళ్లి మాత్రం కచ్చితంగా చేసుకుంటాడని ఈ ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పుకొచ్చారు.ఇప్పటికే పవన్ మూడు పెళ్లిళ్లను టార్గెట్ చేసుకుని రాజకీయ ప్రత్యర్థులు ఆయన్ను విమర్శిస్తున్నారు. ఇప్పుడు నాలుగో పెళ్లి చేసుకుంటారని వేణు స్వామి చెప్పడంతో ..ఆయన అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.












Click it and Unblock the Notifications