మరో బాంబు పేల్చిన వేణు స్వామి..నాగ చైతన్య తండ్రి కాలేడు
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన గతంలో చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో.. వేణు స్వామిని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగిపోయింది. సమంత, నాగచైతన్యలు వివాహిక జీవితం అంత సాఫీగా సాగదని .. మెగా డాటర్ నిహారిక కూడా విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పి సంచలనం సృష్టించారు.
రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్,ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అవుతాయని ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించకున్నారాయన. దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్‌లో క్రేజ్ పెరిగింది. సెలబ్రిటీలు సైతం ఆయనతో పూజలు చేయించుకోవడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఆయన పలువురు రాజకీయ నాయకుల జాతకాలు గురించి కూడా చెప్పడం జరిగింది.

చంద్రబాబు, కవితలు అరెస్ట్ అవుతారంటూ వేణు స్వామి ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే వీరిద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. అయితే ఆయన ఎన్నికల్లో విషయంలో చెప్పిన జాతకాలు ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్‌లు సీఎం అవుతారని చెప్పిన వేణు స్వామి జాతకం తప్పని తేలాయి. దీంతో ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని తేల్చేశారు. కానీ ఆయన తాజాగా నాగ చైతన్య , శోభిత ధూళిపాళ నిశ్చితార్థంపై తనదైనశైలిలో రియాక్ట్ అయ్యారు.
నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితం 2027 వరకు బాగానే ఉందని.. అక్కడి నుంచి వీరి వైవాహిక జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఓ మహిళ కారణంగా వీరు విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని వేణు స్వామి తెలిపారు. వీరు పెట్టుకున్న ఎంగేజ్మెంట్‌కు ముహూర్తం బలం, అలాగే జాతకం వీళ్లకు అనుకూలంగా లేవని వేణు స్వామి తేల్చేశారు. గతంలో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోతారని చెప్పినప్పటి వీడియో బైట్‌ను చూపించారు.
ఈ వీడియోలో వేణు స్వామి మాట్లాడుతూ.. 'నాగచైతన్య జాతక రిత్యా తండ్రి స్థానం బలంగా లేదు. అది తన తండ్రి స్థానం కావచ్చు. లేకపోతే నాగచైతన్య తండ్రిగా మారడం కావచ్చు. పెంపకం విషయంలో లోటు, పాట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహం తదుపరి నాగచైతన్య జాతకంలో తండ్రి అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. నాగచైతన్యకు మాత్రం సహజసిద్ధంగా తండ్రి అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే తన జాతకబలం అలాంటిదని వేణు స్వామి బాంబ్ పేల్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications