నట దిగ్గజం నానా పటేకర్ కన్నుమూత

భారతీయ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తన విలక్షణ నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. ఈ తెల్లవారు జామున గోవాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఫ్లాట్ లో తీవ్ర గుండెనొప్పి రావడంతో నానా పటేకర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆయన మరణవార్త తెలుసుకున్న చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

నానా పటేకర్ కుమారుడు మల్హర్ పటేకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గోవాలోని ఫ్లాట్‌లో ఉన్న సమయంలో నానా పటేకర్ గుండెనొప్పికి గురయ్యారు. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుకున్న డాక్టర్లు ఫ్లాట్ కు చేరుకునే సరికి ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆయనను రక్షించడానికి శతవిధాలా ప్రయత్నించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అత్యవసరంగా గోవా మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.

Veteran actor Nana Patekar died at the age of 75 in Goa after experiencing severe chest pain

మణిపాల్ ఆసుపత్రికి సమీపించే సరికి నానా పటేకర్ పరిస్థితి మరింత క్షీణించింది. డాక్టర్లు సుమారు 45 నిమిషాల పాటు నిరంతరాయంగా సీపీఆర్ అందించి ఆయన ప్రాణాలను నిలపడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఆయన శరీరం స్పందించలేదు. దీంతో తెల్లవారు జామున 5:20 నిమిషాలకు నానా పటేకర్ మరణించినట్లు మణిపాల్ ఆసుపత్రి ఆంకాలజీ విభాగం హెడ్ డాక్టర్ శేఖర్ సాల్కర్ వెల్లడించారు.

విశ్వనాథ్ పటేకర్ సినీ ప్రస్థానం

నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. హిందీ, మరాఠీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. కొన్నింటికి దర్శకత్వం వహించారు. 1978లో విడుదలైన గమన్ అనే సినిమాతో ఆయన తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. డైలాగ్ డెలివరీలో తనదైన శైలిని నిర్మించుకున్నారు. ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యారు. డీగ్లామర్ రోల్ లో ఆయన నటించిన ఎన్నో పాత్రలు బాలీవుడ్ సినిమాను మలుపులు తిప్పాయి.

బాలీవుడ్ చుక్కాని..

సహజ సిద్ధమైన నటనతో పాత్రలకు ప్రాణం పోసే నానా పటేకర్.. అతి తక్కువ కాలంలోనే స్టార్ నటుడిగా ఎదిగారు. ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన పోషించిన పాత్రలు అద్భుతమైనవి. తమిళ సినిమా కాలాలో హరిదేవ్ అభ్యంకర్ గా విశ్వరూపం చూపారు. రజినీకాంత్ ను మించిపోయారు. సుదీర్ఘ కెరీర్‌లో ఆయన ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. పరిందా, క్రాంతివీర్, అగ్నిసాక్షి, ఖామోషీ: ది మ్యూజికల్, అబ్ తక్ చప్పన్, నటసామ్రాట్ వంటి చిత్రాలలో ఆయన కనబరిచిన నటన సినిమా చరిత్రలో నిలిచిపోతుంది.

చిరస్మరణీయుడిగా నిలిపిన పాత్రలు..

ఆయన అసమాన నటనకు గాను మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు వరించాయి. అలాగే కళారంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ 2013లో కేంద్ర ప్రభుత్వం ఆయనను 'పద్మశ్రీ' పురస్కారంతో సత్కరించింది. నానా పటేకర్ మరణం భారతీయ వెండితెరకు తీరని లోటు. ఒక గొప్ప నటుడిగానే కాకుండా, తన విలక్షణ వ్యక్తిత్వంతో ఆయన ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయన పోషించిన అద్భుతమైన పాత్రలు, పలికిన పవర్‌ఫుల్ డైలాగులు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+