బాలకృష్ణ ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేసిన వెంకటేష్?
కెరీర్ పరంగా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మంచి జోరుమీద ఉన్నారు. వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకోవడంతోపాటు బాబీ దర్శకత్వంలో చేస్తున్న 109వ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సీజన్ నడుస్తుండటంతో ఆ సినిమాకు తాత్కాలిక విరామం ప్రకటించిన బాలయ్య ఎన్నికల అనంతరం షూటింగ్ లో పాల్గొంటారు. అప్పటివరకు హీరో లేని సన్నివేశాలను దర్శకుడు షూట్ చేయనున్నారు. పరిశ్రమలో హీరో వెంకటేష్ తో బాలకృష్ణ ఎంతో సన్నిహతంగా ఉంటారు.
తరుచుగా ఫోన్ చేసి మాట్లాడుకోవడటమే కాకుండా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంటుందంటారు. కావాలంటే కొంత సమయం ఫోన్ లో ఇద్దరూ తిట్టుకుంటారని, మరోసారి పోట్లాడుకుంటారని, నాగార్జున, చిరంజీవికన్నా వెంకటేష్ తోనే బాలయ్య స్నేహం ఎక్కువగా ఉంటుంది. తరుచుగా వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటుంటారని ఫిలింనగర్ లో మాట్లాడుకుంటారు. బాలకృష్ణ ఆహాలో అన్ స్టాపబుల్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. కార్యక్రమానికి ఎంతోమందిని నేరుగా ఫోన్ చేసి ఆహ్వానించారు.

అలాగే వెంకటేష్ ను కూడా రావాలని పిలిచారు. అయితే వెంకీ మొదటినుంచి ఎటువంటి టాక్ షోలకు, ఇతర కార్యక్రమాలకు హాజరవడం ఇష్టం ఉండదు. అదే విషయాన్ని బాలకృష్ణకు వెంకీ తెలిపి సున్నితంగా తిరస్కరించాడు. అయితే పట్టువదలకుండా బాలయ్య మాత్రం వెంకీకి ఫోన్ చేసి రావాలని కోరుతుండటంతో కొద్దిరోజులు బాలకృష్ణ ఫోన్ నెంబరును వెంకీ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వీటిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. సైంధవ్ చిత్రం ఫ్లాప్ కావడంతో ప్రయోగాల జోలికి వెళ్లకుండా తనదైనశైలిలోనే సినిమాలు చేయాలని వెంకటేష్ నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications