వెంకటేష్ అంటే ఇష్టం.. ఆపరేషన్ థియేటర్‌లో ఆ సినిమా చూస్తానన్న పేషెంట్ !!!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోలు, మాస్ యాక్షన్ కింగ్స్ ఉండొచ్చు కానీ.. కానీ థియేటర్లకు కుటుంబం మొత్తాన్ని తీసుకురాగల ఏకైక హీరో విక్టరీ వెంకటేష్. జనరేషన్లు మారుతున్నా, సినిమా ట్రెండ్స్ మారుతున్నా ఆయన క్రేజ్ మాత్రం చెక్కుచెదరలేదు. వెంకటేష్ సినిమా వస్తోందంటే చాలు.. అమ్మమ్మ, తాతయ్య దగ్గరి నుండి మనవడు, మనవరాలి వరకు ఎలాంటి సంకోచం లేకుండా థియేటర్ టికెట్లు బుక్ చేసుకుంటారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా వెంకటేష్ తన రూట్ మార్చుకుంటూ నేటి తరం ప్రేక్షకులకు కూడా ఫేవరెట్ హీరోగా మారిపోయారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఆయన చేసిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా టాలీవుడ్‌లో ఆధునిక మల్టీస్టారర్ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత వరుణ్ తేజ్‌తో 'F2', 'F3', నాగచైతన్యతో 'వెంకీ మామ' వంటి సినిమాలు చేసి నేటి తరం ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా తన మాయలో పడేశారు. పెద్దాయనగా, బాబాయ్‌గా ఆయన చేసే పాత్రలు నేటి యువతకు సైతం బాగా కనెక్ట్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే సినిమాలపై అభిమానులు చూపించే ప్రేమకు హద్దులు ఉండవని మరోసారి నిరూపితమైంది. సాధారణంగా మనకు ఇష్టమైన హీరో సినిమా వస్తే థియేటర్లలో సందడి చేయడం, ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం, డైలాగులు చెప్పడం, పాటలకు డ్యాన్స్ చేయడం చూస్తుంటాం. కానీ ఓ మహిళ మాత్రం జీవితంలో అత్యంత కీలకమైన సమయంలో కూడా తన అభిమాన హీరో సినిమా చూస్తూ కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..
వైరల్ అవుతున్న ఫొటోలో ఓ మహిళ ఆసుపత్రి బెడ్‌పై ఉండగా, ఆమె చేతిలోని మొబైల్ ఫోన్‌లో హీరో వెంకటేష్ నటించిన 'సూర్యవంశం' సినిమా ప్లే అవుతున్నట్లు కనిపిస్తోంది. కాగా ఫైబ్రాయిడ్ సర్జరీ సమయంలో ఒక మహిళ ఆందోళనకు గురవడంతో, వైద్యులకు ఆపరేషన్ కష్టంగా మారింది. ఆమెను శాంతపరచడానికి, వారు ఆమె అభిమాన నటుడు వెంకటేష్ నటించిన సూర్యవంశం సినిమాను మొబైల్ ఫోన్‌లో ప్లే చేశారు. అప్పుడు ఆమె కాస్త నార్మల్ అయ్యారని ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Cinema pichollam sir😍
— Mallikarjuna (@veerutherocker) June 15, 2026
Venky sir please check it @VenkyMama pic.twitter.com/5PjHcPB5S8












Click it and Unblock the Notifications