సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హీరోయిన్ వీడియో
టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలో లేక..టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందనే బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ అభివృద్దికి ఎంత దోహదపడుతుందో తెలియదు కాని.. తప్పుదోవ పడుతుందని మాత్రం కచ్చింతంగా చెప్పవచ్చు. ఇటీవలే హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను కుదిపేసిన సంగతి అందరికి తెలిసిందే.

రష్మిక ఫేస్‌ను మార్ఫింగ్ చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. రష్మిక ఎద అందాలు చాలా దారుణంగా ప్రదర్శించినట్టుగా ఈ వీడియోలో చూపించారు. బ్లాక్ కలర్ డ్రెస్‌లో, అసభ్య కరంగా ఎక్స్ పోజింగ్‌తో లిఫ్ట్‌లో వెళుతున్నట్టు రష్మికను ఆ వీడియోలో కనిపించింది. రష్మికపై చేసిన ఆశ్లీల వీడియో గురించి సినీ , రాజకీయ ప్రముఖులు స్పందించారు.

ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని వారు కోరుతూ.. రష్మికకు అండగా నిలిచారు. అయితే ఈ ఘటన మరువక ముందే ఇలాంటిదే మరోకటి చోటు చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ దుస్తులు మార్చుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.రష్మిక మాదిరిగానే కాజోల్ ఫేస్ మార్ఫింగ్ కూడా చేసినట్టు స్పష్టం అవుతుంది.

దీనిని ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఈ వీడియోపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్లనే అలా చేసిన వారు సామాన్యులను వదులుతారా అని కొందరు భయపడిపోతున్నారు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.












Click it and Unblock the Notifications