అది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా..? ఓయో రూమ్ అనుకుంటున్నారా..?
బిగ్ బాస్ షో సంచలనాలకు మారు పేరుగా నిలుస్తోంది. కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్‌లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ..వారిలోని ఎమోషన్స్‌ను బయటకు తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్యం ఉద్దేశం. తొలుత హిందీలో మొదలైన ఈ రియాల్టీ షో తరువాత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ప్రారంభం అయింది.
షో మొదట్లో సెలబ్రిటీలను మాత్రమే తీసుకురాగా తరువాత సామాన్యులను, పెళ్లైన జంటలను కూడా షోకు తీసుకురావడం మొదలుపెట్టారు. తెలుగులో మొదటిసారి భార్యాభర్తలైన వరుణ్ సందేశ్-రితిక షేర్‌లను హౌస్‌లోకి తీసుకువచ్చిన బిగ్ బాస్ యాజమాన్యం.. తరువాత రోహిత్-మారియా జంటను హౌస్‌లోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ వరకు అంత బాగానే సాగింది.

గతంలో హిందీ బిగ్ బాస్‌లో ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు సైతం నిర్వహించారనే టాక్ నడిచింది. మిగత భాషలతో పోలిస్తే హిందీ బిగ్ బాస్‌లో కాస్తా రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకనొక సమయంలో కొందరు కంటెస్టెంట్లు హద్దుమీరిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా హిందీ బిగ్ బాస్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బిగ్ బాస్ హౌస్‌లో ఓ వ్యక్తి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. తనతో రొమాన్స్ చేయాలని ఒత్తిడి చేశాడు.
అమ్మాయి ఎంత వదిలించుకుని వెళ్లిపోదామని చూసినప్పటికీ అతను ఆమెను వదల్లేదు. అప్పుడే అటుగా వచ్చిన మరో మహిళా కంటెస్ట్ కళ్లు మూసుకుని వారి పక్క నుంచి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా..? ఓయో రూమ్ అనుకుంటున్నారా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications