ఆ ఒక్క సినిమా వల్లే తొమ్మిది సినిమాల్లో తీసేశారు..!
ప్రముఖ హిందీ నటి విద్యా బాలన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. 2005లో 'పరిణీత'చిత్రంతో తెరంగేట్రం చేసిన విద్య.. ఆ తర్వాత 'లగే రహో మున్నాభాయ్'తో ప్రేక్షకుల్లో గుర్తింపు పొందింది. ఆ తర్వాత 'పా', 'ఇష్కియా', 'నో వన్ కిల్డ్ జెస్సికా' మరింత చేరువైంది. ఇక 2011 లో వచ్చిన 'ది డర్టీ పిక్చర్'మూవీలో సిల్క్ స్మిత పాత్రలో నటించి ఆడియన్స్ ని మాత్రమే కాకుండా విమర్శకులను సైతం మెప్పించింది. అంతే కాకుండా ఫిలింఫేర్, నేషనల్ అవార్డులతో సహా అనేక పురస్కారాలు గెలుచుకుంది.
అంతే కాకుండా బాలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఎన్.టి.ఆర్: కథానాయకుడు' మరియు 'ఎన్.టి.ఆర్: మహానాయకుడు' చిత్రాలతో నటించింది. ఆ బయోపిక్స్‌లో విద్యా బాలన్.. ఎన్.టి.ఆర్. సతీమణి బసవతారకం పాత్రలో జీవించేశారు అని చెప్పొచ్చు. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించకపోయినప్పటికీ.. తెలుగు వారికీ ఎప్పుడూ గుర్తుండి పోయేలా మనసులు గెలుచుకున్నారు.

ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న విద్యా.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె కెరీర్ తొలినాళ్లలోని చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. మోహన్‌లాల్‌తో సినిమా మధ్యలో ఆగిపోవడంతో రాత్రి రాత్రే తనను 9 ప్రాజెక్ట్‌లలో తీసేశారని వెల్లడించారు. ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడిందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
విద్యా ఏం చెప్పారంటే..
మోహన్ లాల్‌తో కలిసి 'చక్రం' అనే సినిమాకు సంతకం చేశాను. అది కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే అనూహ్యంగా ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆ సినిమా ఆగిపోవడానికి నేనే కారణమని ప్రచారం జరిగింది. నన్ను 'ఐరెన్ లెగ్' అని పేర్కొంటూ రాత్రికి రాత్రే నేను సంతకం చేసిన 9 దక్షిణాది ప్రాజెక్ట్‌ల నుంచి తొలగించారని తెలిపారు. కానీ ఆ సినిమా ఆగిపోవడానికి కారణం తాను కాదని స్పష్టం చేసారు. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్అ వుతున్నాయి.
-
హోలీ ఎప్పుడు? మార్చి 3 లేదా 4నా - స్కూల్స్.. బ్యాంకుల సెలవుపై తాజా నిర్ణయం..!! -
దుబాయ్, అబుదాబీలో భారతీయులకు గుడ్ న్యూస్..! -
కీలక మలుపు తిరిగిన ఇరాన్ యుద్ధం.. చైనా ఎంట్రీ! -
మెగాస్టార్ సినిమాలో విలన్ గా మోహన్ బాబు..! -
సడన్ గా లబ్దిదారుల అకౌంట్ లో రూ.2,000 జమ: పింఛన్ + బోనస్ -
రేషన్ కార్డు దారులకు ఏపీ ప్రభుత్వం బిగ్ ఆఫర్ - ఇక ప్రతీ కుటుంబానికీ..!! -
చంద్రగ్రహణం కారణంగా కలిసొచ్చే రాశులు, కష్టాలొచ్చే రాశులు ఇవే! -
వారి రేషన్ కార్డులు రద్దు, జాబితా సిద్దం - అనూహ్య నిర్ణయం..!! -
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, వారికి కేటాయింపు - పంపిణీ ముహూర్తం..!! -
పాకిస్థాన్ షాకింగ్ నిర్ణయం.. మార్చి 31 వరకు.. -
దుబాయ్ లో ఇరుక్కుపోయిన తెలంగాణా మంత్రి.. పరిస్థితి ఇలా! -
నేడే చంద్ర గ్రహణం- తెరచి వుండే ఆలయాలు ఇవే












Click it and Unblock the Notifications