త్రిష-విజయ్ ప్రైవేట్ ఫొటోలు లీక్..!
తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవలే హీరో పుట్టిన రోజు జరిగింది. తమ అభిమాన హీరోకు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు అభిమానులు. ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం హీరో విజయ్‌కు బర్త్ డే విషెష్ చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే హీరోయిన్ త్రిష కూడా విజయ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈక్రమంలోనే త్రిష ప్రత్యేకంగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ప్రైవేట్ ఫొటో లీక్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఓ పాటను కూడా యాడ్ చేసి మరీ షేర్ చేయడంతో అది నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో వీళ్లిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. ఇదే సమయంలో హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్దమయ్యారంటూ ప్రచారం జరిగింది. విజయ్ తన భార్యకు విడాకులిచ్చి త్రిషను వివాహం చేసుకోబోతున్నారంటూ అనేక కథనాలు కూడా వెలిశాయి.

ఇదిలా ఉంటే తాజాగా హీరో విజయ్ ,త్రిషకు సంబంధించి మరికొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. త్రిషతో కలిసి నడుస్తున్న ఫొటో.. విజయ్ కాలు త్రిష దగ్గరగా ఉన్న ఫొటో కూడా ఉంది. కాళ్ల దగ్గర కూర్చున్నది ఇలా కొన్ని ఫొటోలు బయటకు రావడం జరిగింది. అంతా వీరిద్దరి వ్యవహారం గురించి పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. త్రిష, విజయ్ కలిసి వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలు సైతం బయటకు వచ్చాయి.
దీంతో వీరి మధ్య ఏదో ఉందనే వాదనకు మరింత బలం చేకూర్చినట్టు అయింది. అయితే అభిమానులు మాత్రం ఈ రూమర్లను కొట్టి పారేస్తున్నారు. త్రిష, విజయ్ మంచి స్నేహితులని, గతంలో వారు సినిమా షూటింగ్‌లో దిగిన ఫొటోలను ఇప్పుడు కావాలనే వైరల్ చేస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి త్రిష, విజయ్ వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరి తమపై వస్తోన్న రూమర్లకు త్రిష, విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications