ఎన్నికల వేళ విజయ్ సంచలనం.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్..?
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొంత సమయం మాత్రమే ఉంది. మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశాయి. డీఎంకే, టీవీకే, ఏఐఏడీఎంకే పార్టీలు నువ్వా..? నేనా..? అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి దళపతి విజయ్ పైనే ఉంది. సినిమాల్లో తన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న విజయ్.. ఆ తర్వాత టీవీకే పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఆయన బరిలోకి దిగుతున్నారు. అంతేకాక రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు విజయ్.. తన పార్టీ తరఫున అభ్యర్థులను పెట్టాడు.
ఇక విజయ్ చివరి సినిమా జన నాయగన్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా మూవీలోని పలు అభ్యంతరకర సీన్ల కారణంగా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. అలా వాయిదా పడిన జన నాయగన్ మూవీ ఇప్పటి వరకూ రిలీజ్ కాలేదు. తాజాగా ఈ మూవీ ఆన్ లైన్ లో లీక్ కావడం సంచలనం రేపింది. ఈ మూవీలోని కీలక సీన్లు, పాటలు, ఫైట్స్ హెడీ క్వాలిటీతో ఆన్ లైన్ లో రిలీజ్ అయింది. దాంతో చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దాంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. 300 లకు పైగా పైరసీ లింక్స్ ను సైట్స్ నుంచి తొలగించారు. అలాగే నిందితులపై కాపీరైట్, పైరసీ యాక్ట్స్ కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకూ ఆరుగురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సెన్సార్ బోర్డు (CBFC)తో వివాదం నడుస్తున్న తరుణంలోనే ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం చేశారు. ఇక తదుపరి సినిమాపై విజయ్ నుంచి ఇప్పటివరకూ అయితే ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే జన నాయగన్ సినిమా రిలీజ్ కాకపోవడంతో నిర్మాతలు నష్టాల్లో ఉన్నారు. ఆ లాస్ ను భర్తీ చేసేందుకు విజయ్ మరో సినిమా చేయనున్నట్లు సమాచారం.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
విజయ్ పార్టీలో సినిమా చిచ్చు! కీలక పార్టీ మద్దతు ఖతం -
విజయ్ విజిల్ రీసౌండ్- పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
నన్ను తనివితీరా చూసుకో.. రూ.390 మాత్రమే..! కుర్రాళ్లకు ఆ హీరోయిన్ క్రేజీ ఆఫర్..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ












Click it and Unblock the Notifications