ఆ హీరోయిన్‌తో దొరికిపోయిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికకు సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తోంది. హీరోయిన్ రష్మికతో విజయ్ దేవరకొండ రిలేషన్‌లో ఉన్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే ఈ జంట బహిరంగంగా కనిపించి అభిమానులకు షాకిస్తున్నారు.గత కొన్నేళ్లుగావిజయ్ దేవరకొండ, రష్మికల మధ్య ఎఫైర్ నడుస్తుందనే రూమార్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.
ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్, రష్మిక ఒకరి తరువాత మరొకరు కనిపించడడం .. ఆ వెంటనే ఒకే మాల్దీవుల్లో రష్మిక ,విజయ్ వేర్వేరుగా దర్శనం ఇవ్వడంతో.. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే అభిప్రాయనికి వచ్చేశారు. ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదని విజయ్ దేవరకొండ , రష్మిక క్లారిటీ ఇస్తునే ఉన్నారు. అయినప్పటికీ వీరిపై ఇలాంటి వార్తలు వస్తునే ఉన్నాయి.

ఆ మధ్య బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాప్‌బుల్ షోకి వచ్చిన సందర్భంలో కూడా రష్మిక విజయ్ దేవరకొండకు కాల్ చేసి ఫోన్ స్పీకర్‌లో ఉంది.. తప్పుగా మాట్లాడవద్దని ముందే హింట్ ఇచ్చింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ సైతం విజయ్ దేవరకొండతో రిలేషన్ గురించి రష్మికను టీజ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా వీరి బంధాన్ని బలపరిచే మరో వార్త తెర మీదకు వచ్చింది.
తాజాగా విజయ్ దేవరకొండ , రష్మిక మరోసారి అడ్డంగా దొరికిపోయారు. కొద్ది రోజుల క్రిందట విజయ్ దేవరకొండ తన రౌడీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ పింక్ కలర్ క్యాప్‌తో కనిపించాడు. సరిగ్గా ఇదే కలర్ క్యాప్‌తో రష్మిక దర్శనం ఇచ్చింది.
ఉమెన్స్ డే సందర్భంగా రష్మిక పింక్ కలర్ క్యాప్ ధరించి ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ఇద్దరూ సేమ్ క్యాప్ ఎలా పెట్టుకున్నారబ్బా అన్న చర్చ మొదలైంది. ఫొటోస్‌తో అడ్డంగా దొరికిపోవడంతో విజయ్ దేవరకొండ, రష్మికల ప్రేమ సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై విజయ్ దేవరకొండ , రష్మిక ఎలాంటి వివరణ ఇస్తారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications