ఒకటి కాబోతున్న విజయ్ దేవరకొండ - రష్మిక..పెళ్లి ఎప్పుడంటే ..?
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ఒకటి కాబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే... విజయ్ దేవరకొండ - రష్మిక మొదటగా గీత గోవిందంలో కనిపించారు. ఈ సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.
ఆ తరువాత ఈ జంట డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా కనిపించి మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా జోడి నిలవడంతో విజయ్ దేవరకొండ - రష్మికలపై అనేక పుకార్లు షికార్లు చేశాయి. గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికల మధ్య ఎఫైర్ నడుస్తుందనే రూమార్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.

ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్, రష్మిక ఒకరి తరువాత మరొకరు కనిపించడం .. ఆ వెంటనే ఒకే మాల్దీవుల్లో రష్మిక ,విజయ్ వేర్వేరుగా దర్శనం ఇవ్వడంతో.. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే అభిప్రాయనికి వచ్చేశారు. ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదనివిజయ్ దేవరకొండ , రష్మిక క్లారిటీ ఇస్తునే ఉన్నారు. అయినప్పటికి వీరిపై ఇలాంటి వార్తలు వస్తునే ఉన్నాయి.
తాజాగా వీరిద్దరి గురించి మరో వార్త తెర మీదకు వచ్చింది.ఫిబ్రవరి నెల మొదటి వారంలో విజయ్ దేవరకొండ - రష్మిక ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారని ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతుంది. పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో.. విజయ్ దేవరకొండ - రష్మికలు తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోబోతున్నారనే వైరల్ అవుతుంది.ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ , మేలో పెళ్లి చేసుకోవడానికి ఈ జంట రెడీ అవుతున్నట్టు సమాచారం.

అయితే ఇప్పటివరకు విజయ్ దేవరకొండ కానీ, రష్మిక మందన్న కానీ ఈ విషయంపై స్పందించలేదు. దీంతో వీరి పెళ్లి ఖాయమైన్నట్టే అని అందరు భావిస్తున్నారు. ఫాన్స్ కూడా ఈ జంట చూడముచ్చటగా ఉందంటూ సోషల్ మీడియాలో వారిద్దరిపై పోస్టులు పెడుతున్నారు. మరి పెళ్లిపై వస్తోన్న వార్తలపై విజయ్ దేవరకొండ - రష్మిక జంట ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications