రేపే విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి?
చాలా రోజుల నుంచి రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. మరోసారి ఈ టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ పెయిర్ పెళ్లివార్త సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తోంది. చాలా రోజుల నుంచి ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగబోతోందని ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటివరకు విజయ్, రష్మికలు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. మరో వైపు ఈ జంట రేపు పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో బజ్ నడుస్తోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సిటీ ప్యాలెస్‌లో జరగనున్న వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇద్దరు యువతులు వీడియో రిలీజ్ చేయగా వైరలవుతోంది.
తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో ప్రకారం.. రాజస్థాన్‌లోని ఉదయపూర్ సిటీ ప్యాలెస్లో విజయ్-రష్మికల వివాహ వేడుకలు జరగనున్నాయి. ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుతూ, "విజయ్ దేవరకొండ పెళ్లి రేపే ఇక్కడ జరగబోతోంది, ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి" అంటూ ప్యాలెస్ దృశ్యాలను చూపించారు. దీంతో వీరిద్దరూ కూడా బాలీవుడ్ సెలబ్రిటీల తరహాలో రాజస్థాన్ వేదికగా రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్నారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.

నిశ్చితార్థం రూమర్స్ నిజమేనా?
గతేడాది డిసెంబర్‌లో విజయ్ దేవరకొండ నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరి నిశ్చితార్థం జరిగిందనే వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి వీరి పెళ్లి తేదీపై అనేక ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలు.. ప్రచారంలో ఉన్న ఫిబ్రవరి 26 తేదీ సరిగ్గా మ్యాచ్ అవుతుండటంతో అభిమానులు ఇది నిజమేనని ఫిక్స్ అవుతున్నారు.
స్క్రీన్ పైనా ఈ జంట సందడి - 'రణబాలి'
ఓ వైపు పెళ్లి వార్తలు ఇలా ఉండగా.. మరోవైపు ఈ క్రేజీ జంట మళ్లీ కలిసి నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'రణబాలి' చిత్రంలో విజయ్-రష్మిక జంటగా కనిపించబోతున్నారు. ఇది 1876-78 కాలం నాటి పీరియాడిక్ మూవీ.బ్రిటిషర్ల కాలంలో రాయలసీమ ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే విజయ్ 'రౌడీ జనార్ధన' షూటింగ్ పూర్తి చేయగా, ఈ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.
రహస్యమా? బహిరంగమా?
తమ బంధం గురించి సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలిసినా.. విజయ్, రష్మిక ఇప్పటివరకు అధికారికంగా పెళ్లి గురించి స్పందించలేదు. గతంలో ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్స్ రాగా...తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవ్వడంతో పాటు విజయ్ దేవరకొండ పెళ్లి రేపే అంటూ ఆ అమ్మాయిలు మాట్లాడుకున్న వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఒకవేళ పెళ్లి జరగడం నిజమే అయితే.. ఇది టాలీవుడ్‌లో ఈ ఏడాది బిగ్గెస్ట్ వెడ్డింగ్‌గా నిలుస్తుంది. మరి ఈ 'రౌడీ' హీరో తన 'లిల్లీ'ని అందరికీ చెప్పి పెళ్లి చేసుకుంటాడా లేక సీక్రెట్‌గా ఫినిష్ చేస్తాడా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications