'పుష్ప2' విడుదల వేళ అల్లు అర్జున్‌కు షాక్ ఇచ్చిన క్రేజీ హీరో
పుష్ప2 విడుదలవడానికి పెద్దగా సమయం లేదు. మహా అయితే మరో ఐదురోజులుంది. పాన్ ఇండియా సినిమా కావడంతో దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మూడు రోజుల క్రితమే చెన్నైలోని ఓ కాలేజ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. తర్వాత కేరళలోని కొచ్చిలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కేరళలో అల్లు అర్జున్ అంటే స్టార్ హీరోతో సమానం. కాబట్టి అక్కడ కూడా వేడుక నిర్వహించారు. ఈ రాష్ట్రం నుంచి కూడా భారీ కలెక్షన్లను నిర్మాతలు ఆశిస్తున్నారు.
ఇప్పటికే పాట్నాలో ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. అక్కడ దాదాపు రెండు లక్షల మంది అభిమానులు హాజరయ్యారు. నిజమైన పాన్ ఇండియా ఈవెంట్ అంటే ఇదే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తవుతుందా? లేదంటే మళ్లీ ఆలస్యమవుతుందా? సంగీతం బాగోలేదంటున్నారు.. తమన్ చేత చేయిస్తున్నారు.. అది బాగా వచ్చిందా?.. ఇలాంటి సందేహాల మధ్య ఎట్టకేలకు ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టారు. ముందుగా అన్నపూర్ణ స్టూడియోలో ఓ షో వేశారు. సినీ యూనిట్ తోపాటు అల్లు అరవింద్ కూడా దీన్ని చూశారు. ఆయన బ్లాక్ బస్టర్ గ్యారంటీ అన్నారు. తర్వాత సెన్సార్ కు వెళ్లగా యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా తొలిరోజే రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది.

సరిగ్గా ఇటువంటి తరుణంలోనే రౌడీ, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అల్లు అర్జున్‌ను సర్ ప్రైజ్ చేస్తూ ఓ బహుమతి పంపించారు. విజయ్ కు రౌడీ బ్రాండ్ పేరుతో ఓ దుస్తుల బ్రాండ్ ఉంది. ఓ చొక్కాను బహుమతిగా విజయ్ బన్నీకి పంపించాడు. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అల్లు అర్జున్ విజయ్ ను బ్రదర్ అని సంభోదిస్తాడు. మొదట్లో విజయ్ సినిమాల ఈవెంట్ కు కూడా అల్లు అర్జున్ వెళ్లేవాడు. రౌడీ బ్రాండ్ నుంచి ఓ చొక్కా పంపించడంతో ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియాద్వారా తెలియజేశాడు. అందుకు థాంక్స్ చెప్పాడు. ప్రతి సినిమా విడుదలకు ముందు విజయ్ దేవరకొండ తన రౌడీ బ్రాండ్ నుంచి అల్లు అర్జున్ కు చొక్కా పంపించడం అనేది సెంటిమెంట్ గా వస్తోంది.












Click it and Unblock the Notifications