కారులో వెళ్తూ బస్సులోని వారిని చూస్తా.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా 'రణబాలి' ప్రమోషన్లలో భాగంగా ఆయన తన పర్సనల్ లైఫ్, విజయం, మధ్యతరగతి మనస్తత్వంపై పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. సినీ జీవితంలో సాధించిన విజయం తన జీవనశైలిని మార్చివేసినప్పటికీ.. తన ఆలోచనా విధానం మాత్రం ఇప్పటికీ మారలేదని ఆయన స్పష్టం చేశారు. చిన్నతనంలో ఉన్న మధ్యతరగతి అనుభవాలే ఇప్పటికీ తనను సాధారణ వ్యక్తిగా గుర్తుచేస్తుంటాయని వెల్లడించారు.
బస్సు ప్రయాణం నుంచి కారు వరకు..
గతంలో తాను బస్సుల్లో ప్రయాణించే రోజులను విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. "బస్సు కిటికీ నుంచి పక్కనే కార్లలో వెళ్లేవారిని చూసి.. వారు ఆ కారును తమ సొంత డబ్బులతో కొన్నారా లేక వారి తండ్రి కొనిచ్చారా అని ఆలోచించేవాడిని. అలాగే కారులో ప్రయాణించడం ఎంత హాయిగా ఉంటుందోనని ఊహించుకునేవాడిని" అని విజయ్ దేవరకొండ చెప్పారు. ఆ తర్వాత జీవితం ఎంతో మారిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అదే విజయ్ కారులో వెళ్తూ బస్సులో ప్రయాణించే వారిని చూస్తుంటానని విజయ్ చెప్పుకొచ్చారు. "ఇప్పుడు కారులో కూర్చుని బస్సులోని వారిని చూస్తున్నప్పుడు.. వారి మనసులో ఎలాంటి ఆలోచనలు తిరుగుతుంటాయో అని ఆలోచిస్తాను. నా పాత రోజులు గుర్తుకొస్తాయి" అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

హోదా మారినా మారని ఆలోచనా విధానం
ఒకప్పుడు దూరం నుంచి చూసి ఆశ్చర్యపోయిన కార్లలోనే ఇప్పుడు తాను ప్రయాణిస్తున్నప్పటికీ.. ఆనాటి జ్ఞాపకాలు, మధ్యతరగతి మనస్తత్వం తానొక సాధారణ వ్యక్తి అనే విషయాన్ని నిరంతరం గుర్తుచేస్తుంటాయని విజయ్ దేవరకొండ వెల్లడించారు. డబ్బు, హోదా వల్ల లైఫ్‌స్టైల్ మారినప్పటికీ.. లోపల ఉన్న సాధారణ మనిషి ఆలోచనలు ఎప్పటికీ అలాగే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ చేసిన ఈ నిజాయితీతో కూడిన కామెంట్స్ అభిమానుల హృదయాలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.














Click it and Unblock the Notifications
