పవన్ ఫ్యాన్స్ కు ఘోర అవమానమే ఇది..!
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జులై 31న విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీని జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేశారు. విలక్షణ నటుడు సత్యరాజ్ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో దూసుకెళ్తున్నాయి. రిలీజ్ కు ముందే సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. అటు అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ కింగ్డమ్ మూవీ హవా నడుస్తోంది. మూవీ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడై పోతున్నాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ కు ముందే కొండన్న రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.
అటు ఓవర్సీస్ లోనూ కింగ్డమ్ మూవీకి ఊహించని బజ్ ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓవర్సీస్ లో కొద్దిరోజుల క్రితమే ఓపెన్ చేశారు. దీనికి అక్కడి ఆడియన్స్ నుండి కేవలం ప్రీమియర్ షోస్ కే 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టేలా అనిపిస్తుంది. ఓవర్సీస్ లో ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రానికి రెండు లక్షల 40 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో రౌడీ బాయ్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. కొండన్న కొట్టేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మూవీని ఇటీవల రిలీజైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లుతో కంపేరింగ్ చేస్తున్నారు. అలా చేస్తే హరిహర వీరమల్లుకి ఓవర్సీస్ లోనూ ఈ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ సేల్ అవ్వలేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ దీన్ని అవమానంగా భావిస్తున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిన్న గాక మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ పవన్ కల్యాణ్ సినిమాని తన సినిమాతో కేవలం ప్రీమియర్ షోస్ తోనే దాటేయడం అనేది పవన్ అభిమానులు ప్రస్తుతం జీర్ణించుకోలేక పోతున్నారు.

ఇక ఇటీవల విడుదలైన పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు.. భారీ నష్టాల్ని చవి చూస్తోంది. మొదటి షో నుంచే ప్లాఫ్ టాక్ రావడంతో సినిమాను ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్స్ లో 80-85 శాతం డ్రాప్ కనిపించింది. దీంతో ఈ మూవీతో బిజినెస్ చేసినవాళ్లకు భారీ నష్టాలు తప్పేలా లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలి రోజున సినిమాకు రూ.40 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చి ఆశ్చర్యపరిచింది. పవన్ కల్యాణ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా హరిహర వీరమల్లు నిలిచింది. ఇక రెండో రోజు అయితే దాదాపుగా 85 శాతం మేర కలెక్షన్స్ అమాంతం పడిపోయాయి. నెగెటివ్ టాక్ నేపథ్యంలో హరిహర వీరమల్లు మూవీ ఒక్కసారిగా డౌన్ అయింది. ఏ ఎం రత్నం దాదాపు రూ. 300 కోట్లు పెట్టి తెరకెక్కించారు.












Click it and Unblock the Notifications