లవ్‌పై ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ..రష్మికతో ఫిక్స్..?
గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికల మధ్య ఎఫైర్ నడుస్తుందనే రూమార్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్, రష్మిక ఒకరి తరువాత మరొకరు కనిపించడడం .. ఆ వెంటనే ఒకే మాల్దీవుల్లో రష్మిక ,విజయ్ వేర్వేరుగా దర్శనం ఇవ్వడంతో.. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే అభిప్రాయనికి వచ్చేశారు.
ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదని విజయ్ దేవరకొండ , రష్మిక క్లారిటీ ఇస్తునే ఉన్నారు. అయినప్పటికీ వీరిపై ఇలాంటి వార్తలు వస్తునే ఉన్నాయి. ఆ మధ్య విజయ్ దేవరకొండ , రష్మిక ఇద్దరూ వేర్వేరుగా ఒకే ఇంట్లో ఉంటున్న ఫొటోలను తమ సోషల్ మీడియాల్లో పోస్టు చేశారు.

విజయ్ దేవరకొండ ఒక ఫోటో దిగిన బ్యాక్‌గ్రౌండ్‌లోనే .. రష్మిక కూడా ఫొటో దిగింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పిట్టగోడ రెండూ సేమ్ టు సేమ్. దీంతో వీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నట్టు నిర్ధారించుకున్నారు. రష్మిక తన అసిస్టెంట్ వివాహం కోసం హైదరాబాద్‌కు రావడం జరిగింది. అసిస్టెంట్ పెళ్లికి హజరైన తరువాత రష్మిక,విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది.
ఆ సమయంలో రష్మిక తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అందరు ఒక్కసారి షాక్‌కు గురైయ్యారు.విజయ్ ఇంట్లోనే రష్మిక ఉందని నెటిజన్లు కన్ఫర్మ్ చేసేశారు. తాజాగా ప్రేమ గురించి విజయ్ దేవరకొండ కొన్ని కామెంట్స్ చేశారు.''ప్రేమ అనేది తప్పక పుడుతుంది అబ్బాయిలు. మీరు ఇంకా యంగ్‌గానే ఉన్నారు కాబట్టి కాస్త టైమ్ ఇవ్వండి. అన్నిటికంటే ముందుగా పురుషులు ఎదగాలి. ఇదేం చెడ్డ విషయం కాదు. మీరు కొంచెం సమయం ఇవ్వాలి దానికి.
Love will happen,you guys are young, give it time
— Suresh PRO (@SureshPRO_) November 19, 2024
First of all men need to grow
#VijayDeverakonda @TheDeverakonda pic.twitter.com/r4zFPDYScg
లవ్ విషయంలో 30 దాటిన పురుషులు 20 ఏండ్ల మధ్య ఉన్నవారికంటే బెటర్‌గా ఆలోచిస్తారు. ఇది నా పర్సనల్ అనుభవం. 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉన్నప్పుడు మనం అస్థిరంగా ఉంటాం. ఏది డిసైడ్ చేసుకోలేం. సమయం వచ్చినప్పుడు అవే జరుగుతాయి. ఏది ఫోర్స్‌గా చేయకండి''అని చెప్పుకొచ్చాడు. దీంతో రష్మికతో లవ్‌లో ఉండటం వల్ల విజయ్ దేవరకొండ ఇలా కామెంట్ చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ విజయ్ దేవరకొండ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications