విజయ్ 'జన నాయగన్' మూవీ రిలీజ్ డేట్ ఇదేనా..!
తమిళ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ మూవీ జన నాయగన్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, రాజకీయ డైలాగులు కారణంగా ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ ఫిబ్రవరి 20న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సెన్సార్ బోర్డుకు కొత్త వెర్షన్ ను సమర్పించి అలాగే కోర్టు కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తమిళ స్టార్ హీరో విజయ్ చివరి చిత్రం జన నాయగన్ విడుదలకు ఇప్పటికే అనేక అడ్డంకులు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రాన్ని సెన్సార్ రివ్యూ కమిటీకి పంపుతూ మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ సినిమాకు 'U/A' సర్టిఫికేట్ మంజూరు చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ సినిమాలో కొన్ని విదేశీ శక్తులు భారత్ లో మతపరమైన విధ్వంసాలను రెచ్చగొట్టే విధంగా సీన్లు ఉన్నాయని.. ఇలాంటి సన్నివేశాలు దేశంలోని మత సామరస్యానికి విఘాతం కలిగించే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ పై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఫిబ్రవరి 20న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సెన్సార్ బోర్డుకు కొత్త వెర్షన్ ను సమర్పించి అలాగే కోర్టు కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాను హెచ్. వినోద్ తెరకెక్కించగా, యంగ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించింది. అలాగే మలయాళ బ్యూటీ మమితా బైజు, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.












Click it and Unblock the Notifications