విజయ్ 'జన నాయగన్‌' వచ్చేస్తోంది.. స్పందించిన నిర్మాత

దళపతి విజయ్ 'జన నాయగన్‌' వచ్చేస్తోంది. విజయ్ చివరి సినిమా జన నాయగన్ ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరిగింది. అప్పటినుంచి ఈ మూవీ పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇక తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. దాంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా జన నాయగన్ చిత్ర నిర్మాత విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరై గుడ్ న్యూస్ చెప్పారు.

జన నాయగన్ మూవీ మరో రెండు వారాల్లో థియేటర్లలోకి వచ్చే అవకాశముందని ఆ చిత్ర నిర్మాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు వెంకట్ కె నారాయణ తెలిపారు. జన నాయగన్‌ మూవీ సెన్సార్‌ సర్టిఫికెట్‌ కోసం ఎదురు చూస్తున్నామని అది రాగానే విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక 2026 పొంగల్​ కానుకగా విడుదల కావాల్సిన జననాయగన్ ఆలస్యం అవుతూ వస్తోంది. కోర్టు కేసులు, సెన్సార్ సమస్యలతో సినిమా విడుదలకు నోచుకోవడం లేదు.

Vijay Jana Nayagan Is Finally Coming Producer Breaks Silence and Gives Major Update JanaNayagan

జననాయగన్ సినిమాను హెచ్​. వినోద్​ తెరకెక్కించారు. యంగ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్​ గా దళపతి విజయ్​ తో ఆడిపాడనున్నారు. అలాగే మలయాళ బ్యూటీ మమితా బైజు, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్‌ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి కీలక పాత్రల్లో మెరిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+