డిజాస్టర్ టాక్ తో 300 కోట్ల గ్రాస్.. ఈ రికార్డు నీకే సాధ్యం అన్నా..!

సాధారణంగా ఏ సినిమాకైనా ప్లాఫ్ టాక్ వస్తే ఆ సినిమా వైపు కూడా జనాలు చూడరు. యావరేజ్, హిట్ టాక్ వచ్చినా ఓటీటీలో చూడొచ్చులే అని దాటేస్తుంటారు. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి విజువల్స్, గ్రాఫిక్ ఓ రేంజ్ లో ఉంటేనే థియేటర్ కు వచ్చి సినిమాలు చూస్తున్నారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఇప్పుడు ఇలానే జరుగుతోంది. ప్రేక్షకుల్ని థియేటర్లలోకి రప్పించడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అయితే చాలా అరుదుగా మాత్రమే స్టార్ హీరోల సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి.

ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ 'హృదయం మురళి'
ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ 'హృదయం మురళి'

అలా అదికొద్దిమంది హీరోలు మాత్రమే ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇప్పుడు ఆ స్థానంలోనే ఉన్నారు. ఆయన నటించిన చివరి సినిమా 'జన నాయగన్' ఇప్పుడు థియేటర్ల వద్ద దూసుకెళ్తోంది. సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినా దాదాపు 300 కోట్ల కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. జూలై 23 న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్ల వద్ద ప్రభంజనం కొనసాగిస్తోంది. రానున్న రోజుల్లో ఈ మూవీ ఇంకెన్ని రికార్డుల్ని నమోదు చేస్తుందో చూడాల్సి ఉంది. అయితే ఫ్యాన్స్ మాత్రం డిజాస్టర్ టాక్ తో 300 కోట్ల వసూల్లు నీకే సాధ్యం అన్నా అని కామెంట్స్ పెడుతున్నారు.

Vijay Jana Nayagan nearing the 300 crore gross mark Vijay sets a record with a disaster movie

ఇక జన నాయగన్ మూవీని టాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'భగవంత్ కేసరి' సినిమాకు రీమేక్ గా చేశారు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. అలాగే మలయాళం హీరోయిన్ మమితా బైజు కీలక పాత్ర పోషించింది. ఇక బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ఈ మూవీలో నెగటీవ్ రోల్ లో అలరించారు. అలాగే ప్రకాశ్ రాజ్, ప్రియమణి, గౌతమ్ మీనన్ వాసుదేవ్ తదితరులు ఈ మూవీలో నటించారు. ఈ చిత్రానికి వినోథ్ దర్శకత్వం వహించారు. అలాగే అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. జన నాయగన్ చిత్రాన్ని కేవీఎన్ బ్యానర్ పై వెంకట్ నారాయణ నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+