విజయ్‌ ఆఖరి చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎన్నికల సమయంలోనే.. ఎప్పుడంటే..?

ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. 2026లో తమిళనాడులో జరిగే శాసనసభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్నారు. అయితే విజయ్ ఆఖరి చిత్రం జన నాయగన్ పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ ను స్క్రీన్ పై చూసే ఆఖరి చిత్రం కావడంతో ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Vijay Last Film Jananayagan to Release on January 9th

జన నాయగన్ మూవీలో పూజా హెగ్డే ఫీమేల్​ లీడ్​ లో నటిస్తోంది. బాబీ దేవోల్, మమితా బైజూ ప్రియమణి, ప్రకాశ్‌ రాజ్‌ లాంటి స్టార్స్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

గతేడాది ఫిబ్రవరిలో విజయ్‌ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం(టీవీకే) ప్రారంభించారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. ఇతర పార్టీలకు కూడా మద్దతు ఇవ్వలేదు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని విజయ్ ఇప్పటికే ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+