'పెద్ది' స్థానంలో విజయ్ 'జన నాయగన్'.. ఇదేం ట్విస్ట్ సామీ..!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల కోలాహలం నడుస్తోంది. టీవీకే పార్టీ పెట్టిన తర్వాత విజయ్ తొలిసారిగా ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నాడు. తమిళనాడులోని రెండు స్థానాల్లో విజయ్ పోటీ చేస్తున్నారు. ఇటీవల 243 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు విజయ్. అయితే విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్ రిలీజ్ కు అడ్డంకులు తప్పడం లేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. అయితే జన నాయగన్ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో మూవీ వాయిదా పడింది.

జన నాయగన్ మూవీలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సన్నివేశాలు ఉన్నట్లు సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నో చెప్పింది. దాంతో చిత్ర యూనిట్ మద్రాస్ కోర్టుకు వెళ్లింది. కోర్టు కూడా ఆ సీన్స్ ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో చేసేదేం లేక జన నాయగన్ చిత్ర యూనిట్ ఆ సీన్స్ ను తొలగించింది. ఈ మేరకు ఈ రెండు మూడు రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉంది. దాంతో జన నాయగన్ రిలీజ్ డేట్ పై సామాజిక మాధ్యమాల్లో మరోసారి చర్చ మొదలైంది.

అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఏప్రిల్ 24 లేదా ఏప్రిల్ 30 న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అంటే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23 న జరగనుంది. ఆ మరుసటి రోజే విజయ్ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక ఏప్రిల్ 30 న కేడీ ది డెవిల్ మూవీ రిలీజ్ ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 24 నే విజయ్ జన నాయగన్ మూవీ రిలీజ్ ఉంటుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయనుంది.

Vijay last movie Jana Nayagan Likely to Release on April 24 or April 30 Social Media Buzz erupts

ఇక హెచ్ వినోద్​ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్​ గా నటించంది. మలయాళ బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషించింది. ప్రకాశ్ రాజ్‌, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక ఆయా పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+