Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్యారవాన్‌లో అమ్మాయిలతో రాసలీలలు.. ఖండించిన ప్రముఖ నటుడు

Vijay Sethupathi: దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి.. ఇటీవల తనపై సోషల్ మీడియాలో వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై తొలిసారి బహిరంగంగా స్పందించారు. ఈ ఆరోపణలను ఆయన నాసిరకం, అబద్ధం అని అభివర్ణించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయం వల్ల తన కుటుంబం బాధపడిందని.. అయితే తాను మాత్రం ఈ ఆరోపణల వల్ల ఏ మాత్రం కలత చెందలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో ఫిర్యాదు కూడా నమోదు చేసినట్లు విజయ్ సేతుపతి వెల్లడించారు.

నాకు నాపై నమ్మకం ఉంది: విజయ్ సేతుపతి
విజయ్ సేతుపతి ఈ ఆరోపణలపై మాట్లాడుతూ.. "నన్ను కొద్దిగా తెలిసిన వారైనా ఈ ఆరోపణలు విని నవ్వుకుంటారు. నాకు నాపై నమ్మకం ఉంది. ఇలాంటి నాసిరకం ఆరోపణలు నన్ను కలవరపెట్టలేవు. అవును, నా కుటుంబం, సన్నిహితులు మాత్రం ఆందోళన చెందారు. కానీ నేను వారికి వివరించి, వదిలేయండి, ఈ మహిళ కేవలం కొన్ని నిమిషాల పేరు ప్రఖ్యాతులు పొందాలని చూస్తోంది, ఆమెను ఆనందించనివ్వండి' అని చెప్పాను" అని అన్నారు. తన నిజాయితీ, వ్యక్తిత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Vijay Sethupathi Denies Allegations of Sexual Misconduct Calls it a Conspiracy

సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు
"మేము సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాము. గత ఏడేళ్లుగా నాపై అనేక రకాల పుకార్లు వ్యాపింపజేశారు. కానీ ఇవన్నీ నాపై ఎటువంటి ప్రభావం చూపలేదు, భవిష్యత్తులో కూడా చూపవు" అని విజయ్ సేతుపతి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఈ ఆరోపణలు వచ్చిన సమయం అనుమానాస్పదంగా ఉందని నటుడు అభిప్రాయపడ్డారు. "నా కొత్త సినిమా బాగా ఆడుతోంది. బహుశా, కొంతమంది అసూయపడే వ్యక్తులు ఇలాంటి ఆరోపణలు చేసి సినిమాకు నష్టం కలిగించవచ్చని అనుకుంటున్నారు. కానీ అది జరగదు" అని ఆయన అన్నారు. ఇది తన సినీ ప్రగతిని అడ్డుకోవడానికి జరుగుతున్న కుట్రగా ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ విషయంపై ఆవేదన
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై విజయ్ సేతుపతి ఆవేదన వ్యక్తం చేశారు. "ఈ రోజుల్లో ఎవరైనా ఎవరి గురించైనా ఏదైనా చెప్పవచ్చు. ఎటువంటి ఫిల్టర్లు లేవు. మీకు కేవలం సోషల్ మీడియాలో ఒక ఖాతా ఉంటే చాలు, ఎటువంటి భయం లేకుండా మీరు కోరుకున్నది రాయవచ్చు" అని విజయ్ సేతుపతి అన్నారు. ఇది వ్యక్తుల పరువు, ప్రతిష్టలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆయన పరోక్షంగా సూచించారు.

అసలేం జరిగింది?
కోలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని.. తనకు తెలిసిన ఒక అమ్మాయిని విజయ్ సేతుపతి లైంగికంగా వేధించాడని రమ్య మోహన్ అనే మహిళ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఆ పోస్టులో "విజయ్ సేతుపతి క్యారవాన్ ఫేవర్ కోసం రూ.2 లక్షలు, డ్రైవ్ కోసం రూ.50 వేలు ఆఫర్ చేశాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం సాధువులా వ్యవహరిస్తాడు" అని రాసుకొచ్చింది. ఈ క్రమంలో తన స్నేహితురాలు మానసికంగా కుంగుబాటుకు గురైందని రాసింది. అయితే ఈ పోస్ట్ వైరల్ అయింది. కానీ కొన్ని గంటల్లోనే ఈ పోస్టును డిలీట్ చేయడం గమనార్హం. ఈ క్రమంలో విజయ్ ఫ్యాన్స్ ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆ విమర్శలు నిజమైతే ఎందుకు డిలీట్ చేశావంటూ ప్రశ్నల వర్షం కురింపించారు. దీంతో ఆ మహిళ వివరణ ఇస్తూ.. కోపంలో అలా చేశానని.. అది అలా వైరల్ అవుతుందని ఊహించలేదని.. తన స్నేహితురాలి గోప్యత కోసం పోస్టును తొలగించినట్లు చెప్పుకొచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+