విజయ్ సేతుపతి & కత్రినా కైఫ్‌ల మేరీ క్రిస్మస్ విడుదల వాయిదా...
బాలీవుడ్ నటి కత్రీనాకైఫ్, పాన్ ఇండియా స్టార్ విజయ్‌సేతుపతి జంటగా నటించిన మేరీ క్రిస్మస్ సినిమా వాయిదా పడింది.అంధాధున్ సినిమా దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన మేరీ క్రిస్మస్ డిసెంబర్ 2023లో ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. కానీ ఇది ఇప్పుడు జనవరి 12, 2024కి వాయిదా పడింది.
అంధాధున్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి బాలీవుడ్ చిత్రం మేరీ క్రిస్మస్‌లో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కూడా నటించింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌తో పాటు సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్ను ఆనంద్ నటిస్తున్నారు. అలాగే, తమిళ వెర్షన్‌లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ అదే పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా పోస్టర్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తూ వచ్చారు.

ఈ మూవీ నుంచి ఒక టీజర్ అయినా రిలీజ్ అయితే.. కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలని ఆడియన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విడుదల వాయిదాపై ఇన్‌స్టాగ్రామ్‌లో నటుడు విజయ్ సేతుపతి ఓ సరికొత్త పోస్టర్‌ను షేర్‌చేశాడు. "నిరీక్షణ దాదాపు ముగిసింది! జనవరి 12, 2024న #MerryChristmas మీ శీతాకాలాన్ని ఆనందదాయకంగా మార్చబోతోంది" అని రాసుకొచ్చారు. దీంతో ఈ చిత్రం విడుదలపై అటు బాలీవుడ్‌తో ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులకు కూడా ఫుల్ క్లారిటీ వచ్చినట్లయ్యింది.
క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో : క్రిస్మస్ రోజు రాత్రి జరిగిన సంఘటనల చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని ఇప్పటికే బాలీవుడ్ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తమిళ్, హిందీ లాంగ్వేజ్స్ లో బై లింగువల్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాని పాటలు లేకుండా తొంభై నిమిషాల నిడివిగల చిత్రంగా చెబుతోన్న ఈ చిత్రం ప్రధానంగా ముంబై, పూణే చుట్టుపక్కల ప్రాంతాలలో చిత్రీకరించబడింది. మ్యాచ్‌బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి రమేష్ తౌరానీస్ టిప్స్ ఇండస్ట్రీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications