తమన్నాతో గడపాలని ఉంది.. హీరో షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరి వ్యవహారం గురించి బాలీవుడ్ మీడియాలో చాలా కథనాలు వెలువడ్డాయి.రిలేషన్ గురించి వీరిని ప్రశ్నించగా..అలాంటిది ఏమీ లేదని..తామిద్దరం కేవలం స్నేహితులమే అంటూ మొదట్లో కలరింగ్ ఇచ్చారు.
విజయ్ వర్మ కుటుంబంలో జరిగిన ఓ ఫంక్షన్‌లో తమన్నా తళుక్కున మెరిసింది. దీంతో విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందని అందరికి అర్థం అయింది. ఇదే సమయంలో తమ బంధంపై ఈ జంట గతేడాది చివర్లో ఓ క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఉన్న ప్రేమను బయటపెట్టారు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని..త్వరలోనే పెళ్లికి చేసుకోబోతున్నామంటూ ఈ జంట ప్రకటించింది. తాజాగా తమన్నాతో డేటింగ్‌పై విజయ్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నన్ను చాలామంది తమన్నాకు ఎలా ప్రపోజ్ చేశావని అడుగుతున్నారు. లస్ట్ స్టోరీస్-2 షూటింగ్ సమయంలో తమన్నాకు తాను ప్రపోజ్ చేశానని అందరు అనుకుంటున్నారు. కానీ అందులో వాస్తవం లేదని విజయ్ వర్మ తెలిపారు. లస్ట్ స్టోరీస్-2 సినిమా తమ పరిచియానికి మాత్రమే ఉపయోగపడిందని.. ఆ సినిమా తరువాతే తమ మధ్య ప్రేమ చిగురించిందని విజయ్ వర్మ తెలిపారు.
అయితే తమన్నాకు నా ప్రేమ గురించి నేరుగా చెప్పలేదని.. మీతో నేను ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నా అని తమన్నాతో చెప్పాను.అప్పటికే తమన్నాకు నాపై ఫీలింగ్స్ ఉండటంతో ఆమె కూడా తన ప్రేమకు గ్రీన్ సీగ్నల్ ఇచ్చిందని..ఆ తరువాత తమన్నాతో డేటింగ్ చేయడం మొదలుపెట్టానని విజయ్ వర్మ చెప్పుకొచ్చాడు. మొత్తానికి మొదటిసారిగా తమన్నాతో రిలేషన్ గురించి విజయ్ వర్మ ఈ విధంగా బయటపెట్టాడు.












Click it and Unblock the Notifications