బాలకృష్ణతో సినిమాలు చేయకు..హీరోయిన్‌కు భర్త కండిషన్..?
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1990ల్లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారామె. అగ్ర హీరోలతో నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయ్యేది. అంతే కాకుండా ఈ జోడికి మోస్ట్ హిట్ పెయిర్‌గా మంచి గుర్తింపు వచ్చింది.ఇక బాలకృష్ణతో విజయశాంతి రిలేషన్ మెయిన్‌టైన్ చేశారనే రూమర్స్ కూడా తెర మీదకు వచ్చాయి.
బాలకృష్ణతోనే విజయశాంతి అత్యధిక సినిమాల్లో నటించారు. దాదాపు 17 సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచాయి. ఒకనొక సమయంలో బాలకృష్ణ, విజయశాంతి వివాహం చేసుకుంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారానికి తెర దించుతూ.. ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని విజయశాంతి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించిన విజయశాంతి, బాలకృష్ణతో మాత్రం తిరిగి నటించలేదు.

అయితే భర్త పెట్టిన కండిషన్ కారణంగానే విజయశాంతి బాలకృష్ణతో నటించలేదనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. అయితే అలాంటిది ఏమీ లేదని తర్వాత తేలింది. పెళ్లి తర్వాత విజయశాంతి లేడీ ఓరియేంటెడ్ సినిమాలు మాత్రమే చేశారు. హీరోలతో సమానంగా విజయశాంతి సినిమాలు తెరకెక్కాయి. దీంతో హీరోలతో సినిమాలు చేయడం ఆమె తగ్గించేశారు.
ఇక రాజకీయాల్లో కూడా విజయశాంతి తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో రాములమ్మగా కీర్తి గడించారు. తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టి తర్వాత ఆ పార్టీని అప్పటి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీల్లో పని చేశారామె. ఇక మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో విజయశాంతి రీఎంట్రీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications