కళ్యాణ్ రామ్ సినిమా కోసం మళ్లీ పోలీస్ రోల్ లో విజయశాంతి.. టైటిల్ ఫిక్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ అమితాబ్ గా పేరు సొంతం చేసుకున్న విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో స్టార్ హోరీవం రేంజ్ కి ఎదిగారు. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో స్టార్ హీరోలతో సమానంగా పోటీపడి కోటి రూపాయలు పారితోషకం అందుకున్న మొట్టమొదటి హీరోయిన్ గా నిలిచారు. సినిమాల ద్వారానే కాకుండా రాజకీయాల ద్వారా కూడా ఎంతో పేరు తెచ్చుకుంది విజయశాంతి.
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. #NKR21 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయశాంతి IPS ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా మూవీ మేకర్స్ 'అర్జున్ S/O వైజయంతి' గా రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఆ పోస్టర్ లో.. ప్రతి స్త్రీ ఒక కొడుకును పెంచుకుంటుంది. వైజయంతి ఐపీఎస్ ఇక్కడ అర్జున్ అనే సైన్యాన్ని పోషిస్తోంది'' అని పేర్కొన్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో విజయశాంతి చేతిలో గన్ పట్టుకొని ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తుండగా.. కళ్యాణ్ రామ్ ఇంటెన్స్ అండ్ మాస్ లుక్ లో నడుచుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో సోహైల్ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.
Every woman nurtures a son.
— NTR Arts (@NTRArtsOfficial) March 8, 2025
Vyjayanthi IPS nurtures an army called Arjun ❤️🔥#NKR21 is '𝐀𝐑𝐉𝐔𝐍 𝐒/𝐎 𝐕𝐘𝐉𝐀𝐘𝐀𝐍𝐓𝐇𝐈' 💥💥
Happy Women's Day ✨#ArjunSonOfVyjayanthi@NANDAMURIKALYAN @vijayashanthi_m @saieemmanjrekar @SohailKhan @PradeepChalre10 @SunilBalusu1981… pic.twitter.com/Y5JWx3Fl75
ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకుందని.. మిగిలిన పార్ట్‌లు పూర్తయ్యాక రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. టైటిల్ ని బట్టి వీరిద్దరూ తల్లీ కొడుకులు అని అర్ధమవుతుంది. తల్లీ కొడుకులిద్దరూ ఎలాంటి లక్ష్యం కోసం ఫైట్ చేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది.
నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' సినిమాతో తన కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'అమిగోస్' మూవీ ప్లాప్ అయినప్పటికీ, 'డెవిల్' సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించుకుంది. దాంతో ఈ సినిమాపైనే నందమూరి ఫ్యాన్స్ అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications