ఎట్టకేలకు విజయ్- రష్మిక పెళ్లి కార్డు వచ్చేసింది..! రిసెప్షన్ ఎక్కడంటే..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహం ఈ నెల 26 న జరగనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విజయ్- రష్మిక పెళ్లి కార్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మార్చి 4న రాత్రి 7 గంటలకు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో రిసెప్షన్ జరగనుందని అందులో పేర్కొన్నారు. ఇక వీరిద్దరూ తమ వివాహాన్ని బంధువులు, సన్నిహితుల మధ్య చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వెడ్డింగ్ కార్డుపై విజయ్ టీమ్ నుంచి గానీ.. అటు రష్మిక టీమ్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారి 2018లో గీత గోవిందం చిత్రంలో నటించారు. ఈ మూవీలో ఈ జంట తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. దాంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అప్పట్లో ఈ జంట షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2019 లో డియర్ కామ్రేడ్ చిత్రంలో వీరిద్దరూ నటించారు. ఆ మూవీ సమయంలో ఆ బంధం బలపడిందని.. విజయ్- రష్మిక డేట్ లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి.

ఆ తర్వాత వీరిద్దరూ వెకేషన్ కు వెళ్లడం.. ఎయిర్ పోర్టుల్లో కనిపించడం.. విజయ్ ఫ్యామిలీతో రష్మిక ఎంజాయ్ చేయడం.. విజయ్ మూవీస్ ను రష్మిక థియేటర్ కు వెళ్లి మరీ చూడటం.. ఇలాంటి వరుస ఘటనల నేపథ్యంలో ఇక ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని అందరూ ఫిక్స్ అయ్యారు. అంతేకాక గతేడాది ఈ జంట నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు.

VijayRashmika Mandanna Viral Wedding Card Udaipur Vows on Feb 26 Hyderabad Reception on March 4

అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం. ఫిబ్రవరి 26న విజయ్- రష్మిక ల వివాహం ఉదయపూర్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే మార్చి 4న రిసెప్షన్ కూడా ఉంటుంది. ఈ మేరకు ఇటీవల విజయ్ దేవరకొండ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక మార్చి 4న రాత్రి 7 గంటలకు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో రిసెప్షన్ జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు తాజాగా వీరి పెళ్లి కార్డు నెట్టింట వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+