బయటపడ్డ దిల్ రాజు వీడియో
నిర్మాత దిల్ రాజు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. సంక్రాంతి సినిమాల నేపథ్యంలో చిన్న సినిమాలపై వివక్ష సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. ఈ సంక్రాంతికి నాలుగైదు సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. గుంటూరు కారం, హనుమాన్, సైందవ, నా సామిరంగ, ఈగల్ వంటి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి.
అయితే నిర్మాతల కోరిక మేరకు రవితేజ ఈగల్ సినిమాను వాయిదా వేయడం జరిగింది. అయినప్పటికి కొన్ని సినిమాలకు థియోటర్లు దొరకని పరిస్థితి. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, హనుమాన్ సినిమాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో.. హనుమాన్ సినిమాకు థియోటర్ల దొరకని పరిస్థితి.

దీనిపై హనుమాన్ చిత్ర యూనిట్ బహిరంగంగానే విమర్శలు దిగింది. సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలో కీలక పాత్ర పోషించిన నిర్మాత దిల్ రాజు ఈగల్‌ను వచ్చే నెలలో విడుదలైయ్యేలా ఆ చిత్ర నిర్మాతలను ఒప్పించారు. అయితే హనుమాన్ వాయిదా వేయాలని నిర్మాతలను దిల్ రాజు కోరినప్పటికి.. వారు ప్యాన్ ఇండియా రేంజ్‌లో సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నించడంతో వాయిదా ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
దీంతో హనుమాన్ సినిమాకు అనుకున్నంతగా స్థాయిలో థియోటర్లు లభించలేదు. దీనిపై దిల్ రాజును కొందరు టార్గెట్ చేసుకుని కొందరు విమర్శలకు దిగారు. గుంటూరు కారం సినిమాను నైజంలో దిల్ రాజు విడుదల చేయడం వల్లనే హనుమాన్‌కు థియోటర్లు ఇవ్వడం లేదనే ప్రచారం జరిగింది.
ఈ సమయంలోనే దిల్ రాజుకు మంచి చేడు తెలుసునని.. ఆయనకు పండగను ఎలా వినియోగించుకోవాలో తెలుసునంటూ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలను సైతం కొన్ని వైబ్‌సైట్లు తప్పుగా ప్రచారం చేశాయి. దీనిపై దిల్ రాజుపై మండిపడ్డారు. ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా తనపై విమర్శలు చేస్తున్నారని.. ఇకపై తనపై తప్పుడు వార్తలు రాసే వెబ్‌సైట్‌ల తాటతీస్తానని దిల్ రాజు హెచ్చరించారు.
వైరల్ వీడియో :
— Telugu360 (@Telugu360) January 9, 2024
ఆయన పై తప్పు వార్తలు రాస్తున్న రెండు వెబ్ సైట్స్ కి నిన్న ఒక సినిమా వేదిక పై నుంచి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు గారు .. ఆ వెబ్సైట్ కి చెందిన వారు బయట దొరికితే తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం చేసిన ఈ వీడియో చర్చనీయాంశం అయింది
ఇండస్ట్రీ మొత్తం అసహ్యించుకునే ఒక… pic.twitter.com/pmi2rkOCvW
సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఆయన ఈ విషయం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అసత్య వార్తలు రాస్తున్న వెబ్‌సైట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా దీనికి సంబంధించిన వ్యక్తులపై దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో బయటకు వచ్చింది. తనపై తప్పుడు వార్తలు రాస్తున్న రెండు వెబ్‌సైట్స్‌కి నిన్న వేదికపై నుంచే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Dil mowa masss...
— Konidala Mahesh Babu 🌶️🌶️ (@Michealvelyudhm) January 9, 2024
Andari Lage he is also doing business then what is wrong#DilRaju pic.twitter.com/52qYbXtKtA
మీడియా సమావేశం అనంతరం ఆ వెబ్‌సైట్స్‌కి చెందిన వ్యక్తులపై మాటల దాడి చేశారు. నా గురించి ఎందుకు తప్పుగా రాస్తారని ఆ మీడియా ప్రతినిధులను దిల్ రాజు ప్రశ్నించారు. తనని ఆపడానికి ప్రయత్నించిన వ్యక్తులపై కూడా దిల్ రాజు మండిపడ్డారు. ఆ ఘటనను వీడియో తీస్తున్న వ్యక్తిపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications