Sankranti Celebrations : సంక్రాంతి సంబరాల్లో మెగా కుటుంబం (వీడియో)...
ఏ పండుగైనా, వేడుకైనా సెలబ్రిటీలు ఎంతో గ్రాండ్‌గా జరుపుకుంటారు. అందులో ముఖ్యంగా మెగా ఫ్యామిలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ పండుగైనా కానీ, ఏ వెకెషన్ అయినా కానీ కుటుంబంతో కలిసి ఎంతో సరదాగా గడిపేస్తుంటారు. ఒకరిద్దరు హీరోలు ఒకే ఫ్రేములో కనిపిస్తేనే అభిమానులు సంబరాలు చేసుకుంటుంటారు.
అలాంటిది మెగా ఫ్యామిలీలోని హీరోలంతా ఒకే ఫ్రేములో ఉంటే అభిమానులకు జాతరే. గతేడాది క్రిస్మస్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేములో కనిపించి అభిమానులకు సర్‌ఫ్రైజ్ ఇచ్చారు. ఇక ఇప్పడు తాజాగా సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా మెగా కుటుంబమంతా కలసి బెంగుళూరుకు బయలుదేరారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను టాలీవుడ్ మెగా కుటుంబం బెంగుళూరులో ఘనంగా నిర్వహించుకుంటుంది. పొంగల్‌కి మెగాస్టార్ మనుమరాలు క్లీంకారా తో పాటు, మెగా కుటుంబలో కొత్త కోడలు లావణ్య త్రిపాఠి అడుగుపెట్టడంతో ఈ సంక్రాంతిని మరింత గ్రాండ్‌గా నిర్వహించుకుంటున్నారు. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరుగా బెంగళూరు ఫార్మ్ హౌస్‌కు చేరుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, నేటి ఉదయం అల్లుఅర్జున్, స్నేహరెడ్డి బెంగుళూరు చేరుకోవడం జరిగింది. ఎయిర్‌పోర్ట్ వద్ద అల్లుఅర్జున్ ఫ్యామిలీ ఫోటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెగా కుటుంబంలోని స్టార్స్ అంతా భోగి పండగ వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకున్నారు. ఇందులో రామ్‌చరణ్, వరుణ్‌తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, భోగిపండగ సెలబ్రేషన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications