నిన్ను బిగ్ బాస్ విన్నర్ అనుకోవడమే మేం చేసిన తప్పు

తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్ దిగ్విజయంగా ఎనిమిది వారాలను పూర్తి చేసుకుంది. ఈ ఎనిమిది వారాల్లో బిగ్ బాస్ హౌస్‌లో ఎన్నో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఈసారి కంటెస్టెంట్లగా యష్మీ గౌడ ,నిఖిల్ అభియ్ నవీన్ , ప్రేరణ , ఆదిత్య ఓం , నైనికా ,సోనియా ఆకుల,బెజవాడ బేబక్క, ఆర్‌జే శేఖర్ భాషా , సీత, నాగ మణికంఠ,పృద్వీరాజ్, విష్ణు ప్రియ బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత కొంతమంది వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు.

అయితే హౌస్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్లను ఓసారి పరిశీలిస్తే..అందరి కంటే కాస్తో కూస్తో విష్ణు ప్రియనే బెటర్ అన్న మాటలు వినిపించాయి. టెలివిజన్ షోల ద్వారా పాపులారిటీ సంపాదించిన వారి లిస్ట్ చాలానే ఉంది. అలాంటి వారిలో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు. యాంకర్‌‌గా అతి తక్కువ కాలంలోనే విష్ణు ప్రియ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ''పోవే పోరా' షోతో అమ్మడు మంచి క్రేజ్ సంపాదించుకుంది. తరువాత ఈ భామ పలు షోలతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌ల్లో నటించి మెప్పించింది. తద్వారా వచ్చిన ఫేమస్‌తో బిగ్ బాస్‌లో అడుగుపెట్టింది విష్ణు ప్రియ.

Vishnupriya gets trolled her behaviour

అయితే తొలి రెండు వారాలు బాగానే ఆడిన విష్ణు ప్రియ, ఆ తర్వాత తన గేమ్ మొత్తాన్ని ఒకరిపైనే ఫోకస్ పెట్టింది. సోనియా ఆకుల పుణ్యమా అంటూ మొదట్లో సింపతి సొంతం చేసుకుంది విష్ణు ప్రియ. గత నాలుగు వారాలుగా విష్ణు ప్రియ హౌస్‌లో ఉందంటే ఉందనే విధంగా గేమ్ ఆడుతోంది. విష్ణు ప్రియ మనస్సంతా కూడా పృథ్వీపైనే ఉంది. అతనిపై ప్రేమను బహిరంగంగానే వెల్లడిస్తోంది. అతను సేవ్ అయినప్పుడల్లా విష్ణు ప్రియ చేసే వెకిలి చేష్టలు చూసిన అభిమానులకు చిరాకు వస్తోంది.

తాజాగా విష్ణు ప్రియ పృథ్వీకి నాగార్జున ఎదుటే ముద్దు పెట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిన్ను బిగ్ బాస్ విన్నర్ అనుకోవడమే మేం చేసిన తప్ప అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విష్ణు ప్రియ ఎలిమినేషన్‌లో ఉన్న సమయంలో ఆమెకు తోటి కంటెస్టెంట్ల కంటే ఓట్లు అధికంగా పోల్ అయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. తన ప్రవర్తనతో విష్ణు ప్రియ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. మరి ఇప్పటికైనా తన ఆట తీరును మార్చుకుని టైటిల్ రేసులో ఉంటుందో లేదా, సాధారణ కంటెస్టెంట్ మాదిరిగా హౌస్ నుంచి ఎలిమినేషన్ అవుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+