మహేష్‌కు విశ్వక్ సేన్ కౌంటర్ (వీడియో)
టాలీవుడ్ యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్నాడు. హీరోగా సినిమాలు చేస్తూనే దర్శకత్వం వహించడం మనోడి ప్రత్యేకత. ఫలక్‌నుమాదాస్, దాస్ కా ధమ్కీ వంటి సినిమాలకు విశ్వక సేన్ దర్శకత్వం వహించాడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం విశ్వక సేన్ ప్రత్యేకత. అయితే ఇదే ఆయనకు కొన్నిసార్లు ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టింది.
నటుడు అర్జున్‌తో గొడవ, ప్రముఖ వార్త ఛానెల్లో ఇష్యూ వంటి వాటితో విశ్వక సేన్‌పై ఓ రకమైన అభిప్రాయం ఏర్పడింది. అయినప్పటికీ ఏ తప్పు చేయడం లేదు కాబట్టి తాను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నట్టుగా విశ్వక సేన్ ముందుకు వెళ్తున్నాడు. స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని అయిన విశ్వక సేన్.. తన సినిమాల్లో ఆయన హవా భావాలు పలికించిడానికి ఎక్కువుగా ప్రయత్నిస్తుంటాడు. తాజాగా ''గామీ'' అనే సినిమాతో విశ్వక సేన్ ప్రేక్షకుల ముందు వచ్చాడు.

గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే విశ్వక సేన్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ''గామీ'' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో సోషల్ మీడియా పేజ్ మీమర్‌కి స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. మహేష్ అనే మీమర్ తన ప్రశ్నలతో హీరోలను తికమక పెడుతుంటాడు. ఇటీవల హీరో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ''మా ఊరు భైరవకోన'' సినిమా సమయంలో మహేష్ డబుల్ మీనింగ్ అర్థం వచ్చేలా హీరోను ప్రశ్నించాడు.
దీన్ని గ్రహించిన సందీప్ కిషన్ స్టేజీ మీద ఇలాంటివి వద్దంటూ సున్నితంగా మహేష్ అడిగిన ప్రశ్నను తిరస్కరించాడు. అయితే ఇదే మహేష్ విశ్వక సేన్ ''గామీ'' ఈవెంట్‌లో సినిమాపై ప్రశంసలు కురిపించాడు. మహేష్‌ను గుర్తుపట్టిన విశ్వక సేన్ ఆరె మొన్న నువ్వే కదా ఆ ప్రశ్న అడిగింది. నువ్వు ఆ ప్రశ్న అడగడానికి ఇక్కడ అవకాశం లేదు అని పేజ్ మీమర్ మహేష్‌కు కౌంటరిచ్చాడు. దీనిపై మహేష్ మాట్లాడుతూ.. అన్న అది అనుకోకుండా జరిగిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications