అన్న సినిమాకు మామూలు దెబ్బ కాదిది..!!
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ గా కల్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 30 న రిలీజ్ అయింది. కల్ట్ మూవీలో హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీకి దర్శకత్వం కూడా వహించారు విశ్వక్ సేన్. అయితే గత కొంత కాలంగా ఆయన నటించిన చిత్రాలు విజయం సాధించలేకపోతున్నాయి. ఇప్పుడు కల్ట్ మూవీ కూడా ఆ లిస్టులో చేరింది. నిజానికి విశ్వక్ సేన్ గత చిత్రం 'లైలా' తీవ్ర నిరాశ పరిచింది. ఈ మూవీ తర్వాత తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన 'కల్ట్' సినిమాపై విశ్వక్ సేన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయనకు మరోసారి నిరాశే ఎదురైంది. కల్ట్ మూవీ రిలీజ్ డే నుంచే మిక్స్ డ్ రెస్పాన్స్ ను అందుకుంది.
తాజాగా కల్ట్ మూవీ 4వ రోజున రూ. 70 లక్షల లోపు గ్రాస్ ను అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ.75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను రాబట్టింది. ఇక రూ. 25 లక్షల రేంజ్ లో షేర్ ను సాధించింది. ఇక మొత్తం 4 రోజుల్లో కల్ట్ మూవీ సాధించిన కలెక్షన్స్ చూస్తే నిజాంలో ఇప్పటివరకూ రూ. 2.55 కోట్లు రాబట్టింది. ఏపీలో 2.15 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది. ఓక కర్ణాటక, ఓవర్సీస్ తో కలిపి రూ. 80 లక్షల వరకు కలెక్షన్స్ రాబట్టింది. అన్నీ కలిపితే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి రూ. 5.50 కోట్ల కలెక్షన్స్ దక్కాయి. అలాగే రూ. 2.55 కోట్ల షేర్ లభించింది. బాక్సాఫీస్ వద్ద రూ. 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ మూవీ రిలీజ్ అయింది. ఓవరాల్ గా చూస్తే తీవ్ర నిరాశే ఎదురైంది.

మరోవైపు ఇలా వరుసగా విశ్వక్ సేన్ ను పరాజయాలు వెంటాడుతున్న నేపథ్యంలో ఆయన కథల ఎంపికపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సామాజిక మాధ్యమాల ద్వారా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
