తుఫాను ప్రభావంతో గూడూరు రూట్ లో ప్రధాన పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు..!!
మురుసు తుఫాను ప్రభావం తీర ప్రాంతంలో ఎక్కువగా ఉంది. ప్రకాశం, గుంటూరు తో పాటుగా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అప్రమత్తం అయింది. తుఫాను ప్రభావంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పలు ప్రధాన రైళ్లను రద్దు చేసింది. మరి కొన్ని దారి మళ్లించింది. తుఫాను తీవ్రతకు అనుగుణంగా రైళ్ల రాకపోకల పైన నిర్ణయాలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. తాజాగా చేసిన మార్పులను అధికారులు వివరించారు.
మురుసు తుఫాను తీవ్రత రైల్వే వ్యవస్థ పైన పడింది. తుఫాను ఒంగోలుకు దక్షిణంగా తీరం దాటడంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో పాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మురసు తుఫాన్ ప్రభావంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ, ఒంగోలు, గూడూరు రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. కరవాడి రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర వేగంతో గాలులు వీస్తున్న పరిస్థితి. తుఫాన్ పరిస్థితుల నేపథ్యంలో రైళ్ల రాకపోకలపై దక్షిణ మధ్య రైల్వేమొత్తం 29 రైళ్లను రద్దు చేసింది. విజయవాడ డివిజన్ లో 9 రైళ్లు రద్దు చేసారు. గుంటూరు-తెనాలి-గుంటూరు, తెనాలి-రేపల్లె రైళ్లు రద్దు.. రేపల్లె-మార్కాపుర్-తెనాలి ట్రైన్ సర్వీసులు రద్దు అయ్యాయి.

తుఫాను తీవ్రతకు అనుగుణంగా నిర్ణయాలు
కాగా.. మరికొన్ని దారి మళ్లించడంతో పాటు రీషెడ్యూల్ చేశారు. రద్దు చేసిన రైళ్లల్లో బిట్రగుంట - విజయవాడ (67260), విజయవాడ - గూడూరు (17260),గూడూరు - రేణిగుంట (67203), రేణిగుంట - నెల్లూరు (67204), నెల్లూరు - విజయవాడ (17259), విజయవాడ - నరసాపురం (67258), నరసాపురం - రాజమండ్రి (67246) ఉన్నాయి. కాగా, విజయవాడ - చెన్నై సెంట్రల్ మధ్య నడిచే 'పినాకిని ఎక్స్‌ప్రెస్' (12711) ఆలస్యంగా నడుస్తుంది. ఈ రైలు ఉదయం 8:10 గంటలకు బయలుదేరింది. అసలు అయితే ఉదయం 6.10 గంటలకు బయలుదేరాల్సి ఉంది. 2 గంటల ఆలస్యంగా విజయవాడ నుంచి పినాకిని ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. ఇక.. దారి మళ్లించిన రైళ్ల జాబితాలో కేరళ ఎక్స్‌ప్రెస్ (12625), బెంగళూరు - హతియా (18638), హౌరా - బెంగళూరు (22863), కాన్పూర్ - బెంగళూరు (04131) ఉన్నాయి. ఈ రైళ్లు రేణిగుంట- ఎర్రగుంట్ల-నంద్యాల-గుంటూరు మీదుగా మళ్లించినట్లు వెల్లడించారు.













Click it and Unblock the Notifications
