బెంగళూరులో సినీ ఫక్కీలో చోరీకి యత్నం: చేతులకు ఫెవిక్విక్ పూసి.. మెడపై కత్తి పెట్టి.. !!

బెంగళూరులో అత్యంత రద్దీ ప్రదేశాల్లో ఒకటైన ఇందిరానగర్‌లో పట్టపగలే సినీఫక్కీలో దోపిడీ యత్నం చోటు చేసుకుంది. ఇక్కడి 100 ఫీట్ రోడ్డులో ఓ బ్యాగ్, షూ షాప్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న 23 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి దిగాడు. ఆమె చేతులకు ఫెవిక్విక్ పూసి రూ. 4.5 లక్షల విలువైన 35 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని దోచుకెళ్లడానికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోవడం, అతన్ని బంధించడంతో సుఖాంతమైంది.

ఉదయం దాదాపు 11:45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో దుకాణంలో బాధితురాలు ఒక్కరే కౌంటర్ వద్ద ఉన్నారు. ఒక్కరే ఉన్న విషయాన్ని గమనించిన ఆ వ్యక్తి.. ముఖానికి హెల్మెట్, చేతులకు గ్లౌజులు వేసుకుని షాప్ లోకి చొరబడ్డాడు. ఉన్నపళంగా రిసెప్షన్ డెస్క్ మీదుగా లోపలికి దూసుకెళ్లాడు. తనను ఎవరో చంపడానికి వెంటాడుతున్నారంటూ హంగామా సృష్టించాడు. దీంతో బాధిత మహిళ బయటికెళ్లాలంటూ గట్టిగా కేకలు వేయడంతో జేబులో నుంచి కత్తి బయటికి తీశాడు.

Bengaluru police arrested a man for allegedly holding receptionist at knifepoint in broad daylight

తన ప్రాణాలకు ప్రమాదం ఉందని గ్రహించిన బాధితురాలు షాప్ యజమానికి ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. నిందితుడు ఆమెను లొంగదీసుకుని దాడికి దిగాడు. కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కాడు. ఆమె ప్రతిఘటించకుండా ఉండటానికి అరచేతులకు ఫెవిక్విక్ పూశాడు. దీంతో ఆమె రెండు చేతులూ అతుక్కుపోయాయి. అనంతరం ఆమె మెడపై కత్తి పెట్టాడు. మెడలో ఉన్న 35 గ్రాముల మంగళసూత్రాన్ని తెంపుకుని జేబులో వేసుకున్నాడు.

బెంగళూరులో ఠారెత్తిస్తోన్న మెనూ.. పాల క్యాన్లతో రోడ్డెక్కిన కేంద్ర మంత్రి
బెంగళూరులో ఠారెత్తిస్తోన్న మెనూ.. పాల క్యాన్లతో రోడ్డెక్కిన కేంద్ర మంత్రి

తీవ్ర భయాందోళనలో ఉన్నప్పటికీ, బాధితురాలు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. చేతులను విడిపించుకుని షాప్ డోర్ తెరిచి, గట్టిగా కేకలు వేశారు. ఇది గమనించిన స్థానికులు, చుట్టుపక్కల వ్యాపారులు వెంటనే ఆ షాప్ వద్దకు చేరుకున్నారు. బయట జనం గుమిగూడడం గమనించిన నిందితుడు మరింత రెచ్చిపోయాడు. బాధితురాలి జుట్టు పట్టుకుని మళ్లీ లోపలికి ఈడ్చుకెళ్లి, ఆమె మెడపై కత్తిపెట్టి జనం ఎవ్వరూ కూడా లోపలికి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.

ఏపీ మీదుగా పట్టాలెక్కిన బెంగళూరు వందే భారత్ స్లీపర్: 8 హాల్ట్ స్టేషన్లు
ఏపీ మీదుగా పట్టాలెక్కిన బెంగళూరు వందే భారత్ స్లీపర్: 8 హాల్ట్ స్టేషన్లు

అయినప్పటికీ.. షాప్ యజమాని, స్థానికులు లోనికి వెళ్లి, నిందితుడిని చుట్టుముట్టారు. దీంతో అతను కత్తిని చూపెడుతూ షాప్ ఓనర్ పైనా దాడికి దిగి, మహిళ మెడపై కత్తిపెట్టి రోడ్డు మీదికి వెళ్లాడు. ఓ దశలో ఆటో ఎక్కి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ స్థానికులు భయపడకుండా అతడిని చాకచక్యంగా లొంగదీసుకున్నారు. పోలీసులకు అప్పగించారు.

నిందితుడిని ప్రభురాజ్‌గా గుర్తించారు పోలీసులు. అతనిపై బీఎన్ఎస్ 309 కింద కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడని, కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తమ ప్రాథమికంగా విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. అతడి కుటుంబం, వ్యక్తిగత నేపథ్యం గురించి మరింత సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటన నుంచి బాధితురాలు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+