మెగాస్టార్ భారీ సోషియో ఫాంటసీ చిత్రం.. రిలీజ్ డేట్ పై బిగ్ అప్డేట్..!

మెగాస్టార్ చిరంజీవి అనగానే అందరికీ మాస్ యాక్షన్ మూవీస్, డాన్సులు, డైలాగ్స్ గుర్తుకొస్తుంటాయి. ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు చిరంజీవి. అయితే ఇప్పుడు ఆయన చేస్తున్న చిత్రాల్లో భారీ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆయన గతంలో బింబిసార చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ మూవీలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశ్వంభర చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఛోటా కే. నాయుడు కెమెరామెన్‌ గా వ్యవహరిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ నేపథ్యంలో చేసిన సినిమాలు చాలా తక్కువే అప్పట్లో అంజి చిత్రంలో ఆయన నటించారు. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయాన్ని అందుకోలేక పోయింది. దాంతో చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ మళ్లీ అలాంటి జానర్ లో చిత్రం చేస్తున్న క్రమంలో ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం విజువల్ పరంగా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో తెరకెక్కుతోంది. 14 లోకాల నేపథ్యంలో సాగే ఈ భారీ ఫాంటసీ అడ్వెంచర్‌ పై ట్రేడ్ వర్గాలు భారీ అంచనాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. విశ్వంభర మూవీ ఓటీటీ డీల్ తాజాగా ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో విశ్వంభర విడుదల తేదీని చిత్రబృందం త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ విషయం తెలియగానే మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Vishwambhara Megastar Chiranjeevi s movie heads towards release clarity on the release date soon

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ విశ్వంభర ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత రిలీజ్ డేట్ ను చిత్ర బృందం ప్రకటించనుంది. అయితే విశ్వంభర మూవీ ఇప్పటికే థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ దసరా కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా అది వర్కవుట్ కాలేదు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్​ చేసినట్లు సమాచారం అందుతోంది. కానీ చిరంజీవి- బాబీ కాంబోలో తెరకెక్కుతున్న కాకా మూవీ ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సమ్మర్ కు విశ్వంభర వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+