సూర్య మూవీ.. ‘విశ్వనాథ్ & సన్స్’ మొదటి రివ్యూ
సూర్య హీరోగా, వెంకీ అట్లూరీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న క్రేజీ ప్రాజెక్ట్ 'విశ్వనాథ్ & సన్స్'. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, ప్రత్యేకించి ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాను వెండితెరపై చూడబోతున్నామనే నమ్మకం కలిగించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ సంగీతమందించారు. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రం రన్ టైమ్ 2 గంటల 28 నిమిషాలుగా లాక్ అయ్యింది.
కథలోని అసలు ట్విస్ట్ ఏంటంటే?
పిస్టల్ షూటింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన సంజయ్ విశ్వనాథ్ జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతనికి మూడేళ్ల వయసున్న ఒక బాబు ఉంటాడు. దురదృష్టవశాత్తూ ఆ చిన్నారికి బోన్ మ్యారో సర్జరీ చేయాల్సి వస్తుంది. సరైన డోనర్ కోసం వెతుకుతున్న క్రమంలో, అమెరికాలో ఉన్న మ్యాడీ (మమితా బైజు) గురించి సంజయ్‌కి తెలుస్తుంది. కొడుకు ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఆమెను ఇండియాకు తీసుకురావాలని సంజయ్ నిర్ణయించుకుంటాడు. అయితే, 40 ఏళ్ల వయసున్న సంజయ్‌తో, కొడుకు ప్రాణాలు కాపాడేందుకు వచ్చిన మ్యాడీ ఊహించని విధంగా ప్రేమలో పడుతుంది. ఈ విచిత్రమైన, ఎమోషనల్ ప్రేమకథ చివరకు ఏ తీరానికి చేరిందనేదే సినిమాలోని ప్రధాన ఇతివృత్తం.

ఫస్ట్ హాఫ్ vs సెకండ్ హాఫ్
సంజయ్ విశ్వనాథ్ జీవితం, అతన్ని గోల్డ్ మెడలిస్ట్‌గా తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర, ఆ నమ్మకాన్ని అతడు నిలబెట్టుకున్న తీరుతో ప్రారంభమవుతుంది. బాబు అనారోగ్యం, అమెరికా ప్రయత్నాలు, మమితా బైజు ఎంట్రీతో ఇంటర్వెల్ వైపు కథ వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్‌పై మంచి క్యూరియాసిటీని పెంచుతుందని తెలుస్తోంది. కాకపోతే, కొన్ని సన్నివేశాలు కాస్త స్లోగా సాగుతాయని, అక్కడక్కడా కొంత బోర్ అనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. సెకండ్ హాఫ్‌లో మాత్రం వెంకీ అట్లూరీ తన మార్క్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడని సమాచారం. సూర్య-మమితా బైజుల మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ పై చాలా కొత్తగా, ఆకట్టుకునేలా వచ్చిందంటున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే ఎమోషనల్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.














Click it and Unblock the Notifications